BJP: బీసీ బిల్లు రాష్ట్రపతి వద్ద ఉండగా.. ఆర్డినెన్స్ తేవడంలో ఆంతర్యమేంటి?
ABN , Publish Date - Jul 13 , 2025 | 03:56 AM
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు రాష్ట్రపతి వద్ద ఉన్న సమయంలో దాన్ని ఉపసంహరించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడంలో ఆంతర్యమేంటని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.
గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశముందా?
రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నలు
న్యూఢిల్లీ, జూలై 12(ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు రాష్ట్రపతి వద్ద ఉన్న సమయంలో దాన్ని ఉపసంహరించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడంలో ఆంతర్యమేంటని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగా గవర్నర్ ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందా..? అని ప్రశ్నించారు.
ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోద ముద్ర వేసినా.. ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే పరిస్థితి ఏంటని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన బుర్రా వెంకటేశం డెడికేటేడ్ కమిషన్ సిఫారసులను ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు. బీసీల పట్ల కాంగ్రెస్ మాటలు కోటలు దాటేలా ఉన్నాయని, లోపల మాత్రం వంచన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. న్యాయస్థానాల్లో నిలబడేలా రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు
కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి