Ramchander Rao: స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలి
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:57 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలని, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటే లక్ష్యంగా పార్టీ సోషల్ మీడియా పని చేయాలని బీజేపీ ..
ఆ దిశగా బీజేపీ సోషల్ మీడియా పనిచేయాలి
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా
గిట్టని వారు పార్టీలో విభేదాలు సృష్టిస్తారు
కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి: రాంచందర్‌రావు
చంపాపేట, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలని, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటే లక్ష్యంగా పార్టీ సోషల్ మీడియా పని చేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, పార్టీ సోషల్ మీడియా జాతీయ కన్వీనర్ ప్రేమ్ శుక్లా అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి స్థానిక సంస్థల ఎన్నికలే తొలిమెట్టు అని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయాలని కోరారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్‌లోని ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికల బీజేపీ మీడియా, ఐటీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి వర్క్‌షా్‌పను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ్ శుక్లా మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఘన విజయానికి సోషల్ మీడియా ప్రధాన ఆయుధం అని అన్నారు. ఆరు గ్యారంటీలను నెరవేర్చడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సోషల్ మీడియా కార్యకర్తలను కోరారు. గిట్టని వారు పార్టీలోనే విభేదాలు సృష్టిస్తారని, అటువంటి వాటి పట్ల కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని, పనులు మాత్రం గడప దాటడం లేదని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News