Farmer Welfare: ‘స్థానిక’ ఎన్నికల కోసమే రైతు భరోసా
ABN , Publish Date - Jul 18 , 2025 | 05:03 AM
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ ప్రభు త్వం రైతుభరోసా నిధులు విడుదల చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు.
ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్న హామీ ఏమైంది?
రైతుల విషయంలో కాంగ్రెస్‌ది మొసలి కన్నీరు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శ
హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ ప్రభు త్వం రైతుభరోసా నిధులు విడుదల చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. రాష్ట్ర రైతాంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చాక 19నెలలు రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు వారి శ్రేయస్సు గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కిసాన్‌మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో రాంచందర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘‘రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్న హామీ ఏమైంది? ధరణిని భూభారతిగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. అనేకమంది రైతులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలిచ్చే పరిస్థితి లేదు. రిటైరైన ఉద్యోగులకు ప్రయోజనాలు అంద డం లేదు’’ అని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేేస లక్ష్యంతో మార్కెటింగ్, రుణ సదుపాయాలు కల్పిస్తోందని చెప్పారు. కేంద్రం వైఖరి కారణంగానే యూరియా కొరత ఏర్పడిందంటూ రాష్ట్ర ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. గుజరాత్‌లో రైతు ఉద్యమాలు కేంద్రంగా భారతీయ కిసాన్ సంఘ్ పనిచేసి, బీజేపీ గెలుపునకు మూల స్తంభంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలోనూ కిసాన్‌మోర్చా రైతులతో మమే కం కావాలని, కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను వివరించాలని పిలుపునిచ్చారు.
ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి షెడ్యూల్
రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి గురువారం షెడ్యూల్ ప్రకటించింది. ఈనెల 19 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుండగా.. ఆగస్టు 10 వరకు సీట్ల భర్తీ చేసుకునే అవకాశం కల్పించింది. అర్హత, ఎంపిక విధానానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేశామని మండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డి కోరారు. మరిన్ని వివరాల కోసం కళాశాలల అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు. కాగా, ప్రైవేటు కాలేజీల్లో 70శాతం సీట్లను ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తుండగా, మిగతా 30శాతం సీట్లను యాజమాన్య కోటా ద్వారా భర్తీ చే స్తారు.
ఇవి కూడా చదవండి
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి 5 పురస్కారాలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి