BC Students: విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:23 AM
ప్రభుత్వ ఖజానా ఉన్నది కాంట్రాక్టర్ల కోసమా లేక కాలేజీ విద్యార్థుల కోసమా పలువురు వక్తలు ప్రశ్నించారు. వారం పది రోజుల్లో విద్యార్థుల ఫీజు బకాయిలు ఇవ్వకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.

వారంలో ఫీజు బకాయిలు ఇవ్వకుంటే సచివాలయం ముట్టడి
బీసీ విద్యార్థుల సమర శంఖారావంలో నాయకుల హెచ్చరిక
ప్రభుత్వ ఖజానా ఉన్నది కాంట్రాక్టర్ల కోసమా అని ప్రశ్న
కవాడిగూడ, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఖజానా ఉన్నది కాంట్రాక్టర్ల కోసమా లేక కాలేజీ విద్యార్థుల కోసమా పలువురు వక్తలు ప్రశ్నించారు. వారం పది రోజుల్లో విద్యార్థుల ఫీజు బకాయిలు ఇవ్వకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. విద్యార్థుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వారి చదువులను విచ్ఛిన్నం చేస్తోందని, వారి జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు, ప్రైవేటు యూనివర్సిటీల్లో సామాజిక రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరా పార్కు వద్ద బీసీ విద్యార్థుల సమర శంఖారావ మహాసభ నిర్వహించారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షి్‌పలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించకుండా వారి ఉసురు పోసుకుంటోందన్నారు. రూ.4,600 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిరంతర ప్రక్రియగా కొనసాగాలే కానీ సీఎం జేబు నుంచి ఇస్తున్నట్లు భావించవద్దని సూచించారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఒక మాట వచ్చాక మరోమాట మాట్లాడుతోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, బీసీ కులాల ఐక్యవేదిక చైర్మన్ కుందారం గణేశ్‌చారి, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్, బీసీ విద్యార్థి మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ సంఘం నేతలు శ్యామ్ కురుమ, మాదేశి రాజేందర్, గూడురు భాస్కర్, మహిళా సంఘం అధ్యక్షురాలు మణిమంజరి, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
నాలుగో టీ20.. టీమిండియాకు సూపర్ న్యూస్.. మహాబలుడు వచ్చేస్తున్నాడు
కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..
ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి