BC Reservations: కులగణనకు వ్యతిరేకంగా మార్చి 9న చలో హైదరాబాద్
ABN , Publish Date - Feb 12 , 2025 | 06:04 AM
బీసీల అణిచివేతకు నిరసనగా, డెడికేటెడ్ కమిషన్ నివేదిక, కులగణనను వ్యతిరేకిస్తూ బుధవారం నుంచి మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని..

వేల మందితో బీసీ కులగణన రణభేరి నిర్వహిస్తాం.. నేటి నుంచి మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు
తప్పుల తడకగా బీసీ కులగణన లెక్కలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
ఈ సర్కారు బీసీ వ్యతిరేకి : వకుళాభరణం
పంజాగుట్ట, బర్కత్‌పుర, నంగునూరు, ఫిబ్రవరి11 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు పోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీల అణిచివేతకు నిరసనగా, డెడికేటెడ్ కమిషన్ నివేదిక, కులగణనను వ్యతిరేకిస్తూ బుధవారం నుంచి మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని.. మార్చి 9న చలో హైదరాబాద్ పేరుతో వేల మందితో బీసీ కులగణన రణభేరి నిర్వహించి ప్రభుత్వానికి సత్తా చూపుతామని హెచ్చరించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏ ర్పాటు సమావేశంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. తప్పుల తడకలా బీసీ కులగణన లెక్కలున్నాయని, కమిషన్ నివేదిక చిత్తు కాగితంతో సమానమన్నారు. కులగణనలో శాస్త్రీయ విధానాన్ని పాటించలేదని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ మేరకు డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పిస్తుందని ఆశించామన్నారు. బీసీల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం అడుకుంటోందని.. తమతో పెట్టుకుంటే గతంలో జనార్దన్ రెడ్డి, కేసీఆర్‌లను ఇంటికి పంపించినట్టే ఈ ప్రభుత్వాన్ని, సీఎంను ఇంటికి పంపుతామనిన్నారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కె.కేశవరావు తదితరులతో 4 గంటలు చర్చించామని.. కులగణన తప్పులతడక అని వారికి ఆధారాలూ చూ పామని, వారు కూడా దానికి అంగికరించి, సీఎంతో చర్చిస్తామని చెప్పారని అన్నారు. 48 గంటలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తాము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పా రు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థి పీ రవీందర్, కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ నియోజకవర్గం పట్టభద్రుల అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్యలను గెలిపించి సత్తా చూపుతామన్నారు.
రహస్య నివేదికలో ఆంతర్యమేమిటి?
స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు, కులగణనపై ఏర్పాటు చేసిన భూసాని వెంకటేశం నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ రూపొందించిన నివేదికను రహస్యంగా చీఫ్ సెక్రటరీ శాంతకుమారికి అందజేయడంలో ఆంతర్యం ఏమిటి? అని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ప్రశ్నించారు. నివేదికను సీఎం తీసుకోకపోవడాన్ని తాము తీవ్రంగా తప్పుపడుతున్నామన్నారు. ఆ నివేదికను వెంటనే వాపసు తీసుకొని నిపుణులు, బీసీ సంఘాల నేతలతో చర్చించి సమగ్రమైన నివేదికను రూపొందించి వాటి వివరాలను బహిర్గతం చేయాలన్నారు. మంగళవారం కాచిగూడలో విలేకరులతో వారు మాట్లాడారు. కులగణనలో బీసీ జనాభా తగ్గించడం వల్ల స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గే ప్రమాదం ఉందన్నారు. బీసీలలోని కులాల వివరాలను ప్రభుత్వం రీసర్వే చేయాలన్నారు. ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తుందని, ఇది బహిర్గతం చేయకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. త్వరలో ఆర్.కృష్ణయ్య సారఽధ్యంలో బీసీ సంఘాల సమావేశం నిర్వహించి ఉద్యమ ప్రణాళికను రూపొందిస్తామన్నారు.
గుణపాఠం తప్పదు: హరీశ్ రావు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇచ్చిన మాట నిలుపుకోకుండా ఎన్నికలకు వెళ్తే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు
Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..
Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం
Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి
Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు
For National News And Telugu News