Hyderabad: బొట్టుపెట్టుకొచ్చాడని విద్యార్థిపై ఆగ్రహం..
ABN , Publish Date - Mar 05 , 2025 | 10:27 AM
బొట్టు పెట్టుకుని స్కూల్‌కు వచ్చిన విద్యార్థిపై ప్రిన్సిపాల్(Principal) ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి బొట్టు కడిగించాడు. హయత్‌నగర్ సూర్యనగర్ కాలనీలో జరిగింది. ప్రస్తుం ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

- వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి కడిగించిన ప్రిన్సిపాల్
హైదరాబాద్: బొట్టు పెట్టుకుని స్కూల్‌కు వచ్చిన విద్యార్థిపై ప్రిన్సిపాల్(Principal) ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి బొట్టు కడిగించాడు. హయత్‌నగర్ సూర్యనగర్ కాలనీకి చెందిన ప్రకాష్‌రెడ్డి కుమారుడు నందకిషోర్‌రెడ్డి(Nandakishore Reddy) పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోగల లక్ష్మారెడ్డి పాలెంలోని క్యాండర్ ష్రైన్ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం బొట్టుపెట్టుకుని స్కూల్‌కు హాజరయ్యాడు, ప్రార్థన అనంతరం ప్రిన్సిపాల్ లక్ష్మయ్య(Principal Lakshmaiah) విద్యార్థుల యూనిఫామ్స్ చెక్ చేస్తున్న క్రమంలో నందకిషోర్‌రెడ్డి(Nandakishore Reddy) వద్దకు వచ్చి బొట్టు ఎందుకు పెట్టుకువచ్చావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ వార్తను కూడా చదవండి: MLA: ఎమ్మెల్యే సబితరెడ్డి ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..
విద్యార్థి మెడపై నాలుగైదుసార్లు కొట్టి వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి బొట్టును కడిగించాడు. గతంలో కూడా విద్యార్థులపై ప్రిన్సిపాల్ ఇలాగే ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి కుటుంబ సభ్యులు, హిందూ వాహిని ఆర్గనైజేషన్ ప్రతినిధులు స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్‌ను తొలగించామని యాజమాన్యం తెలిపింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించారు.
ఈ వార్తను కూడా చదవండి: పదవుల కోసం పైరవీలు వద్దు
ఈ వార్తను కూడా చదవండి: సకల సదుపాయాలతో అర్బన్ పార్కులు
ఈ వార్తను కూడా చదవండి: ప్రజారోగ్యంపై పట్టింపేదీ!
ఈ వార్తను కూడా చదవండి: హాలియాలో పట్టపగలు దొంగల బీభత్సం
Read Latest Telangana News and National News