lifetime achievement: అంపశయ్య నవీన్, అంతడుపుల రమాదేవిలకు పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలు
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:17 AM
పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలకు సాహిత్య విభాగంలో నవలా రచయిత అంపశయ్య నవీన్, కళారంగంలో అంతడుపుల రమాదేవి ఎంపికయ్యారు.
13న రవీంద్రభారతిలో ప్రదానం..
కరీంనగర్ కల్చరల్/హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలకు సాహిత్య విభాగంలో నవలా రచయిత అంపశయ్య నవీన్, కళారంగంలో అంతడుపుల రమాదేవి ఎంపికయ్యారు. ఈమేరకు పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన తండ్రి పొన్నం సత్తయ్యగౌడ్ చారిటబుల్ ట్రస్టు ద్వారా ఏటా రచయితలు, కళాకారులకు పురస్కారాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే.. ఎంపిక కమిటీ కన్వీనర్ డాక్టర్ పొన్నం రవిచంద్ర సారథ్యంలో జ్యూరీ కమిటీ సభ్యులు కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, సీనియర్ జర్నలిస్టు దిలీ్‌పరెడ్డి, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి.. ట్రస్టు చైర్మన్, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎంపికైన వారి పేర్లు, వివరాల పత్రాన్ని అందజేశారని అశోక్ గౌడ్ వెల్లడించారు. పొన్నం సత్తయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఈనెల 13న రవీంద్రభారతిలో పురస్కారాలు అందజేసి అవార్డు గ్రహీతలకు రూ.51 వేల నగదుతో పాటు మెమెంటో, ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నట్లు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వాస్తవాలు చెబితే.. తప్పు పట్టిన బీఆర్ఎస్
ఆలయాల అభివృద్ధిపై సమీక్ష.. సీఎం కీలక ఆదేశాలు
For More TG News And Telugu News