Share News

‘శంషాబాద్‌’లో సులభంగా ఇమిగ్రేషన్‌

ABN , Publish Date - Jan 17 , 2025 | 03:40 AM

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫాస్ట్‌ట్రాక్‌ ఇమిగ్రేషన్‌ -ట్రస్డెడ్‌ ట్రావెలర్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌టీఐ-టీటీపీ) అందుబాటులోకి వచ్చింది. దీనిని గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వర్చువల్‌గా ప్రారంభించారు.

‘శంషాబాద్‌’లో సులభంగా ఇమిగ్రేషన్‌

  • ఎఫ్‌టీఐ-టీటీపీని వర్చువల్‌గా ప్రారంభించిన అమిత్‌షా

శంషాబాద్‌ రూరల్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫాస్ట్‌ట్రాక్‌ ఇమిగ్రేషన్‌ -ట్రస్డెడ్‌ ట్రావెలర్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌టీఐ-టీటీపీ) అందుబాటులోకి వచ్చింది. దీనిని గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎంఆర్‌ సీఈవో ప్రదీప్‌ ఫణీకర్‌ మాట్లాడుతూ.. ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఫాస్ట్‌ట్రాక్‌ ఇమిగ్రేషన్‌ విధానాన్ని కేంద్రం ప్రారంభించిందన్నారు.


దేశంలోని 7 విమానాశ్రయాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. దేశ పాస్‌పోర్టు కలిగిన వారు, ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా కార్డుదారుల కోసం ఈ సదుపాయాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఎఫ్‌టీఐ-టీటీపీ కోసం రిజిస్ర్టేషన్‌ ప్రక్రియకు నెల పట్టవచ్చని, అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల కోసం మొత్తం 8 ఎలక్ర్టానిక్‌ గేట్లను ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 03:40 AM