Share News

BJP Amit Shah: గొడవలను మాకు వదిలేయండి

ABN , Publish Date - Jul 25 , 2025 | 04:56 AM

రాష్ట్ర బీజేపీ నేతల మధ్య ఉన్న సమస్యలను తాము చూసుకుంటామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు.

BJP Amit Shah: గొడవలను మాకు వదిలేయండి

  • రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేయండి

  • రాంచందర్‌రావుకు అమిత్‌ షా దిశానిర్దేశం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌/కరీంనగర్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బీజేపీ నేతల మధ్య ఉన్న సమస్యలను తాము చూసుకుంటామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. నేతల గొడవలను తమకు వదిలేసి రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రాంచందర్‌రావు గురువారం అమిత్‌ షాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర పార్టీలో ఇటీవలి పరిణామాలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని జాతీయ నాయకత్వానికి వదిలేయాల ని అమిత్‌ షా చెప్పినట్లు బీజేపీ వర్గాల కథనం. బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని తమ సర్వేల్లోనూ ఆ విషయం వెల్లడైందని అన్నట్లు సమాచా రం. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థారులోు పర్యటించాలని దిశానిర్దేశం చేశారు.


కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు: డీకే అరుణ

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ ఫోన్‌ ట్యాపింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారని, ఇప్పుడేమో.. ట్యాపింగ్‌ జరిగి ఉంటే తనకు నోటీసులు వచ్చేవి కదా.. అని అంటున్నారన్నారు. గతంలో రేవంత్‌ చేసిన ఆరోపణలు నాటకమా..? లేక ఇప్పుడు బీఆర్‌ఎ్‌సతో కుదిరిన ప్యాకేజీ డీలే కారణమా..? అనే అనుమానం కలుగుతోందని ఒక ప్రకటనలో విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీని విమర్శించే హక్కు కాంగ్రె్‌సకు, సీఎం రేవంత్‌కు లేదని మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ అన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీసీలకు జనాభా ప్రతిపాదికన క్యాబినెట్‌లో చోటిచ్చి రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని మోదీని ప్రశ్నించాలన్నారు.


28న సిట్‌ విచారణకు బండి సంజయ్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఈ నెల 28న సిట్‌ ముందు హాజరుకానున్నారు.ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సంజయ్‌కి ఈ నెల 17న సిట్‌ నోటీసులిచ్చింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఈ నెల 28న ఆయన సిట్‌ ముందు హాజరై, వాంగ్మూలం ఇవ్వనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:56 AM