రైతుల్ని రెచ్చగొడుతున్న కేటీఆర్: అడ్లూరి లక్ష్మణ్
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:25 AM
పదేళ్లు అధికారంలో ఉండి రైతుల్ని ఏనాడూ పట్టించుకోని కేటీఆర్.. ఇప్పుడు వారిని రెచ్చగొడుతున్నాడని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధ్వజమెత్తారు.

హైదరాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): పదేళ్లు అధికారంలో ఉండి రైతుల్ని ఏనాడూ పట్టించుకోని కేటీఆర్.. ఇప్పుడు వారిని రెచ్చగొడుతున్నాడని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధ్వజమెత్తారు. సీఎల్పీ మీడియా హాల్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ రూ.2 లక్షలలోపు రైతు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. సంక్రాంతి తర్వాత రైతు భరోసానూ ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. రైతు భరోసా గురించి మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని సూచించారు.