క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం
ABN , Publish Date - Jan 05 , 2025 | 10:44 PM
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయని సివిల్ జడ్జి ముఖేష్, ఏసీపీ రవికుమార్‌లు అన్నారు. ఆదివారం ఏఎంసీ క్రీడా మైదానంలో న్యాయవాదులకు, పోలీసుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహిం చారు.
బెల్లంపల్లి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయని సివిల్ జడ్జి ముఖేష్, ఏసీపీ రవికుమార్‌లు అన్నారు. ఆదివారం ఏఎంసీ క్రీడా మైదానంలో న్యాయవాదులకు, పోలీసుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహిం చారు. వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతీ ఒక్కరు ఒత్తిడికి లోనవుతారని, క్రీడలతో ఒత్తిడి దూరమవుతుందని, స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు.
క్రీడలతో మానసికంగా దృఽఢంగా తయారవుతారని పేర్కొన్నారు. పోలీసు జట్టు విజయం సాధించింది. సీఐలు దేవయ్య, కుమారస్వామి, అఫ్జలోద్దీన్, న్యాయవాదులు చిప్ప మనోహర్, రవి, మాదురి రాకేష్‌తో పాటు సబ్ డివిజన్‌లోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.