Share News

Adi Srinivas: కల్వకంట్ల కుటుంబానికి రేవంత్‌ ఫీవర్‌: ఆది శ్రీను

ABN , Publish Date - Aug 09 , 2025 | 04:45 AM

కల్వకుంట్ల కుటుంబానికి రేవంత్‌ రెడ్డి ఫీవర్‌ పట్టుకుందని.. రేవంత్‌ పేరు చెబితేనే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావు, కవితలకు చలి జ్వరంతో వణుకు పుడుతోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

Adi Srinivas: కల్వకంట్ల కుటుంబానికి రేవంత్‌ ఫీవర్‌: ఆది శ్రీను

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): కల్వకుంట్ల కుటుంబానికి రేవంత్‌ రెడ్డి ఫీవర్‌ పట్టుకుందని.. రేవంత్‌ పేరు చెబితేనే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావు, కవితలకు చలి జ్వరంతో వణుకు పుడుతోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌కు కేసీఆర్‌ ఫోబియా పట్టుకుందని కేటీఆర్‌ అనడం హాస్యాస్పదంగా ఉందని.. అసలు రేవంత్‌కు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించడానికే సమయం సరిపోవడం లేదని వ్యాఖ్యానించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలంగాణ గజినీగా పరిణమించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.


ఈ డిసెంబరే కాదు.. ఇంకా పది డిసెంబరులు వచ్చినా తెలంగాణకు సీఎంగా రేవంతే ఉంటారని చెప్పారు. గాంధీభవన్‌లో చేపట్టిన ప్రజాప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ముఖాముఖిలో ఆయన పాల్గొని ప్రజలు, కార్యకర్తల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్

‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 09 , 2025 | 04:45 AM