BC Girls Hostel: బీసీ గురుకుల బాలికల హాస్టల్‌లో ఆహారం కల్తీ
ABN , Publish Date - Jul 18 , 2025 | 03:57 AM
జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్ మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల బాలికల హాస్టల్‌లో కల్తీ ఆహారంతో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
40మంది విద్యార్థినులకు అస్వస్థత..జగిత్యాల జిల్లాలో ఘటన
జగిత్యాలరూరల్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్ మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల బాలికల హాస్టల్‌లో కల్తీ ఆహారంతో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు బుధవారం రాత్రి భోజనంలో చికెన్ కర్రీ వడ్డించారు. అందులో కారం, మసాలా ఎక్కువకావడంతో జీర్ణంకాక కడుపు నొప్పి, అజీర్ణ సమస్యలతో విద్యార్థినులు వాంతులు చేసుకున్నట్లు జగిత్యాల జిల్లా వైధ్యాధికారి డాక్టర్ ప్రమోద్ తెలిపారు. ఆయనతోపాటు ఉప వైద్యాధికారి శ్రీనివాస్ హాస్టల్‌లో అస్వస్థతకు గురైన విద్యార్థినులకు
వైద్య శిబిరం నిర్వహించి చికిత్స అందించడంతో విద్యార్థినుల ఆరోగ్యం మెరుగుపడింది. మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని జగిత్యాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సత్యప్రసాద్ ఆస్పత్రిలో విద్యార్థినులను పరామర్శించారు.
ఇవి కూడా చదవండి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి