Share News

Electricity: వేసవి సీజన్‌లో కూడా 24 గంటలూ కరెంట్‌ సరఫరా

ABN , Publish Date - Feb 06 , 2025 | 01:44 PM

వేసవి సీజన్‌లో ప్రజలకు 24 గంటలు నిరంతరంగా నాణ్యమైన కరెంటు సరఫరా చేసేందుకు ముందుస్తుగా పకడ్బందీ, ప్రణాళికాబద్ధంగా చర్యలకు సన్నద్ధమవుతున్నామని తుక్కుగూడ విద్యుత్‌ ఎడీఈ శంకర్‌(Thukkuguda Electricity ADE Shankar) అన్నారు.

Electricity: వేసవి సీజన్‌లో కూడా 24 గంటలూ కరెంట్‌ సరఫరా

  • పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి అదనంగా

  • ట్రాన్స్‌ఫార్మర్లు బిగిస్తాం: ఏడీఈ శంకర్‌

హైదరాబాద్: వేసవి సీజన్‌లో ప్రజలకు 24 గంటలు నిరంతరంగా నాణ్యమైన కరెంటు సరఫరా చేసేందుకు ముందుస్తుగా పకడ్బందీ, ప్రణాళికాబద్ధంగా చర్యలకు సన్నద్ధమవుతున్నామని తుక్కుగూడ విద్యుత్‌ ఎడీఈ శంకర్‌(Thukkuguda Electricity ADE Shankar) అన్నారు. ఒక్క క్షణం పాటు విద్యుత్‌ పంపిణీ లోపాలు, అంతరాయం లేకుండా వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా తమ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇతర సీజన్ల కంటే వేసవిలో ఒక్కసారిగా వాతావరణం మార్పు, ఎండల తీవ్రత పెరగడం, సుమారు 30శాతం కరెంట్‌ అధికంగా ప్రజలు వినియోగిస్తారన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Mastan Sai: మస్తాన్ సాయిని కస్టడీకి కోరిన పోలీసులు..


ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల ఇతరత్రా వాడకం తీవ్రత పెరుగుతోందన్నారు. వేసవి సీజన్‌లో కరెంట్‌ పంపిణీకి సంబంధించి ఎలాంటి డోకా ఉండదని తెలిపారు. ఈ దిశగా కరెంట్‌ డిమాండుకు తగ్గుట్టుగా విద్యుత్‌ పంపిణీ సామర్థ్యాన్ని పెంచేందుకు తన పరిధిలో చర్యలు చేపట్టామన్నారు. తుక్కుగూడ సెక్షన్లలో కరెంట్‌ తాకిడి తీవ్రతను తట్టుకునేందుకు అదనంగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఆయా చోట్ల బిగిస్తున్నామని ఆయన వెల్లడించారు.


ఈ మేరకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించగా మంజూరు లభించిందని పేర్కొన్నారు. ప్రాంతాలను గుర్తించామని, త్వరలో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేసవికాలం ముగిసే వరకూ 24 గంటల పాటు తమ సిబ్బంది విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సమస్యాత్మక బస్తీలు, కాలనీల్లో కరెంట్‌ సమస్యల గురించి ఫిర్యాదులు రాగానే సిబ్బంది అక్కడకు వెళ్లి మరమ్మతుల ద్వారా కరెంట్‌ సరఫరాను పునరుద్ధరిస్తున్నామన్నారు.


city10.jpg

ఏ వేళలో అయినా కరెంట్‌ లోపాలు, సమస్యలు వస్తే కందుకూరు, మహేశ్వరం, తుక్కు గూడ, జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వారు మామిడిపల్లి, మల్లాపూర్‌, బాలాపూర్‌, ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్స్‌కు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. అంతేకాకుండా కరెంట్‌ డిమాండు దృష్టిలో పెట్టుకుని అత్యవసర వేళలో ప్రజల సౌకర్యార్థం సంచార ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులో ఉంచుతామని ఏడీఈ శంకర్‌ వివరించారు. ఎక్కడైన కరెంట్‌ సమస్యలు వస్తే వెంటనే 9490153575 ఫోన్‌ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: అది అసమగ్ర కులగణన

ఈవార్తను కూడా చదవండి: GHMC: ప్యారానగర్‌ డంపుయార్డ్‌ పనులు ప్రారంభం

ఈవార్తను కూడా చదవండి: Mastan Sai: మస్తాన్‌కు డ్రగ్స్‌ టెస్ట్‌లో పాజిటివ్‌!

ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

Read Latest Telangana News and National News

Updated Date - Feb 06 , 2025 | 01:44 PM