Wifi Router Off: బెడ్‌రూమ్‌లోని వైఫై రౌటర్‌ను రాత్రి వేళ ఆఫ్ చేయాలనుంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Sep 01 , 2025 | 05:43 PM
రాత్రి వేళ వైఫై ఆఫ్ చేస్తేనే బెటరనే నమ్మకం జనాల్లో ఉంది. ఈ విషయమై శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: రాత్రంతా నిద్రపోయినా మరుసటి ఉదయం అలసటగా అనిపిస్తోందా? దీనికి వైఫై రౌటర్ ఒక కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. విద్యుదయస్కాంత తరంగాల వల్ల నిద్ర చెడిపోయే అవకాశం ఉందని ఇప్పటికే కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇక వైఫై రౌటర్ రాత్రి పగలూ ఆన్‌లో ఉండాల్సిన ఉపకరణం. కానీ రాత్రి వేళ దీన్ని ఆఫ్ చేస్తేనే బెటరని కొందరు చెబుతారు. మరి అసలు నిపుణులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఆస్ట్రేలియాకు చెందిన ఆర్‌ఎమ్‌ఐటీ యూనివర్సిటీ అధ్యయనం (2024) ప్రకారం, వైఫై రౌటర్‌కు సమీపంలో నిద్రపోయే వారిలో సుమారు 27 శాతం మందిని నిద్రలేమి వేధిస్తుందట. ఇక 2021 నాటి మరో అధ్యయనం ప్రకారం వైఫై రౌటర్‌లోని 2.4 జీహెచ్‌జీ సిగ్నల్ వల్ల డీప్ స్లీప్ అనే నిద్ర దశలో ఆటంకాలు ఏర్పడతాయట. అయితే, డబ్ల్యూహెచ్‌ఓ మాత్రం ఈ వాదనలను కొట్టిపారేస్తోంది. వైఫై తరంగాల సామర్థ్యం చాలా తక్కువ అని, నిద్రపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది.
రాత్రి వేళ వైఫై ఆఫ్ చేస్తే కలిగే బెనిఫిట్స్
నిద్రరాక ఇబ్బంది పడే వారు బెడ్‌రూమ్‌లోని వైఫైని ఆఫ్ చేయడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల విద్యుత్ ఆదాతో పాటు ఇంటర్నల్ డాటా కూడా పొదుపు అవుతుంది. రౌటర్ ఎక్కువ కాలం పాటు మన్నికగా పనిచేస్తుంది. రౌటర్ విడుదల చేసే తరంగాలతో ఎలాంటి అపాయం లేకపోయినా దీని వల్ల మనశ్శాంతి కూడా దక్కుతుందని నిపుణులు చెబుతున్నారు. కుదిరితే వైఫై రౌటర్‌ను పడక గదికి బదులు మరో గదిలో పెట్టుకోవాలని అంటున్నారు.
వైఫై రౌటర్‌ను ఎప్పుడు ఆఫ్ చేయకూడదంటే..
స్మార్ట్ కెమెరా, స్మార్ట్ లైట్, వాయిస్ అసిస్టెంట్ వంటి వాటిని వినియోగిస్తున్నప్పుడు వైఫైని ఆఫ్ చేయకూడదు. లేకపోతే ఇవి పనిచేయకపోయే ప్రమాదం ఉంది. వైఫై లేకపోతే స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ వ్యవస్థ కూడా పనిచేయదు. కాబట్టి, నిద్రాభంగం కాకుండా ఉండాలనుకునే వారు వైఫైని బెడ్‌రూమ్‌కు బదులు మరో గదిలో ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఒత్తిడికి లొంగిపోతూ ప్రమాదకర సమాధానాలు.. చాట్‌జీపీటీతో చిక్కులు
ల్యాప్‌టాప్ బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్ ఫాలో అయితే..
Read Latest and Technology News