Share News

Laptop Battery Saving Tips: ల్యాప్‌టాప్ బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్ ఫాలో అయితే..

ABN , Publish Date - Aug 30 , 2025 | 02:11 PM

లాప్‌టాప్ బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కొన్ని టిప్స్ పాటించాలి. మరి నిపుణులు చెబుతున్న ఈ టిప్స్‌ గురించి కూలంకషంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

Laptop Battery Saving Tips: ల్యాప్‌టాప్ బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్ ఫాలో అయితే..
Laptop Battery Draining Fix

ఇంటర్నెట్ డెస్క్: ల్యాప్‌టాప్ బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోవడం అనేది చాలా మంది ఎదుర్కొనే సమస్య. ఈ పరిస్థితికి ల్యాప్‌టాప్‌లోని పవర్ సెట్టింగ్స్ కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. సిస్టమ్స్‌లో సెట్టింగ్స్‌ను జాగ్రత్తగా అవసరాలకు తగినట్టు మార్చుకుంటే బ్యాటరీ చార్జింగ్ చాలా సేపు నిలిచి ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

వీలైనంత వరకూ ల్యాప్‌టాప్‌ను బ్యాటరీ లేదా ఎనర్జీ సేవర్ మోడ్‌లో వాడుకోవాలి. దీని వల్ల బ్యాక్‌గ్రౌండ్ యాప్ యాక్టివిటీ, హార్డ్‌వేర్ వాడకం తగ్గుతుంది.

స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించడం, స్లీప్ టైమర్స్‌ను మన వాడకాన్ని బట్టి మార్చుకుంటే బ్యాటరీ చార్జింగ్ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.

ల్యాప్‌టాప్ ఆన్ చేయగానే స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్స్‌ను గుర్తించి అవి మొదలు కాకుండా సెట్టింగ్స్‌లో మార్పులు చేయాలి. టాస్క్ మేనేజర్ ద్వారా ఈ యాప్స్ ఏవో సులువుగా గుర్తించొచ్చు.


బ్లూటూత్, వైఫైలను అవసరం లేని సందర్భాల్లో ఆఫ్ చేసి ఉంచితే బ్యాటరీ చార్జింగ్‌ను పొదుపుగా వాడుకోవచ్చు.

ల్యాప్‌టాప్‌లో హైపర్‌ఫార్మెన్స్ సెట్టింగ్స్‌కు బదులు సమతుల లేదా పవర్ సేవింగ్ సీపీయూ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఆశించిన ఫలితాలు ఉంటాయి.

డ్రైవర్స్, ఆపరేటింగ్ సిస్టమ్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేసుకుంటూ ఉంటే చార్జింగ్‌ను మరింత పొదుపుగా వాడుకోవచ్చు.

బ్యాటరీ హెల్త్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను కూడా ఆన్‌లో పెడితే బ్యాటరీ మెరుగ్గా పనిచేస్తుంది.

ల్యాప్‌‌టాప్ వాడనప్పుడు ఎక్స్‌టర్నల్ డివైజ్‌లు కనెక్ట్ చేసి ఉంచడం కూడా బ్యాటరీ త్వరగా అయిపోవడానికి ఒక కారణం అన్న విషయం మర్చిపోకూడదు. బ్యాటరీ యూసేజీపై కూడా ఒక లుక్కేసి ఉంచితే లోపాలను వెంటనే గుర్తించి సరిదిద్దవచ్చు. అత్యవసర సమయాల కోసం వ్యక్తులు తమ వద్ద పవర్ బ్యాంకు లేదా స్పేర్ బ్యాటరీని రెడీ చేసుకోవాలి.


ఇవి కూడా చదవండి:

స్మార్ట్ ఫోన్‌లోని ఫ్లైట్ మోడ్‌తో ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా..

స్మార్ట్ ఫోన్‌లో సీక్రెట్ సెట్టింగ్స్.. వీటిని సరిగ్గా వాడుకుంటే..

Read Latest and Technology News

Updated Date - Aug 30 , 2025 | 02:20 PM