WhatsApp: వాట్సాప్ సరికొత్త ఫీచర్.. త్వరలోనే..
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:33 PM
వాట్సాప్ త్వరలోనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారులు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లను నేరుగా తమ వాట్సాప్ ఖాతాలకు లింక్ చేసుకునే అవకాశం కల్పించనుంది.
సోషల్ మీడియాలో ఎన్నో యాప్స్ ఉన్నాయి. అందులో అందరికీ బాగా తెలిసిన యాప్ వాట్సాప్. తర్వాత ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే, వాట్సాప్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. చిన్న పిల్లలు మొదలుకుని పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగిస్తారు. వీడియో కాల్స్, ఫోన్ కాల్స్, చాటింగ్, స్టేటస్ ఇవన్నీ వాట్సాప్ లో చేసుకునే అవకాశం ఉంటుంది. టెక్నాలజీ పెరగడంతో వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫిచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
ఈ క్రమంలోనే వాట్సాప్ త్వరలోనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారులు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లను నేరుగా తమ వాట్సాప్ ఖాతాలకు లింక్ చేసుకునే అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం iOS కోసం బీటాలో ఉన్న ఈ ఫీచర్, ఖాతా సెట్టింగ్‌లలో వినియోగదారుల సోషల్ మీడియా ప్రొఫైల్‌లకు లింక్ లను జోడిస్తుంది. ఈ అప్‌డేట్ వినియోగదారులకు లింక్ విజిబిలిటీపై నియంత్రణను అందించేటప్పుడు కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.
WABetaInfo ప్రకారం, ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ ప్రొఫైల్ సెట్టింగ్‌ల నుండి యాక్సెస్ చేయవచ్చు, దీని ద్వారా వినియోగదారులు తమ వాట్సాప్‌కు ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను లింక్ చేసుకోవచ్చు. బీటా వెర్షన్ ఇన్‌స్టాగ్రామ్ లింక్‌లకు మాత్రమే మద్దతు ఇస్తుంది. భవిష్యత్‌లో ఫేస్‌బుక్ వంటి ఇతర మెటా యాజమాన్య ప్లాట్‌ఫారమ్‌లను కూడా లింక్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ సెట్టింగ్స్ లాగానే ఈ ఫీచర్‌లో కూడా వినియోదారులు తమకు ఇష్టమైతేనే ప్రొఫైల్‌లను అందరికి కనిపించే విధంగా పెట్టుకోవచ్చు. లేకపోతే హైడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి అధికారిక విడుదలకు ముందు వ్యక్తిగత ఖాతాల కోసం వాట్సాప్ ఒక ప్రామాణీకరణ దశను ప్రవేశపెట్టవచ్చు.
Also Read: రూ.4 లక్షల టిక్కెట్‌తో విలాసవంతమైన ఫ్లైట్ జర్నీ! వీడియో చూసి షాకవుతున్న జనాలు