Share News

Realme P4 Pro 5G: ఇండియాలో లాంచ్ అయిన రియల్‌‌మీ పీ4 ఫోన్లు

ABN , Publish Date - Aug 20 , 2025 | 08:55 PM

Realme P4 Pro 5G: రియల్ ‌మీ పీ4 ప్రో, పీ4 5జీ ఫోన్లు ఇండియాలో బుధవారం లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్‌లలో అత్యాద్భుతమైన ఫీచర్లు చాలా ఉన్నాయి. రియల్ ‌మీ పీ4 ప్రో, పీ4 5జీ ధర, ఇతర ఫీచర్ల విషయానికి వస్తే..

Realme P4 Pro 5G: ఇండియాలో లాంచ్ అయిన రియల్‌‌మీ పీ4 ఫోన్లు
Realme P4 Pro 5G

టెక్ ప్రియులు ఎంత గానో ఎదురుచూస్తున్న రియల్ ‌మీ పీ4 ప్రో, పీ4 5జీ ఫోన్లు ఇండియాలో బుధవారం లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్‌లలో అత్యాద్భుతమైన ఫీచర్లు చాలా ఉన్నాయి. మార్కెట్‌లో పోటీ తట్టుకుని నిలబడ్డానికి కంపెనీ రియల్ ‌మీ పీ4 ప్రో, పీ4 5జీలలో చాలా మార్పులు చేసింది. కొత్త కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. రియల్ ‌మీ పీ4లో ఏఐ పవర్డ్ కెమెరా ఉంది. ఈ ఫోన్లలో మీడియా టెక్, స్నాప్ డ్రాగన్ చిప్‌సెట్లను వాడారు. రియల్ ‌మీ పీ4 ప్రో, పీ4 5జీ ధర, ఇతర ఫీచర్ల విషయానికి వస్తే..


రియల్ ‌మీ పీ4 ప్రో ఫీచర్స్

  • ఈ ఫోన్ 6.8 ఇంచెస్ అమొలాయిడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.

  • కార్నింగ్ గోరిల్లా గ్లాస్ ఏఐ డిస్‌ప్లేకు రక్షణగా ఉంటుంది.

  • స్నాప్ డ్రాగన్ 7 జెనరేషన్ 4 చిప్‌సెట్‌తో పాటు హైపర్ ఏఐ చిప్‌సెట్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది.

  • ఏఐ ట్రావెల్ స్నాప్, ఏఐ స్నాప్ మోడ్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

  • ఇందులో 12 జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ ఉంది.

  • ఆండ్రాయిడ్ 15 వర్షన్‌పై ఫోన్ పని చేస్తుంది.

  • ఇందులో 50 ఎంపీ కెమెరా ఉంది.

  • 7000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.


రియల్ మీ పీ4 ఫీచర్స్

  • ఈ ఫోన్ 6.77 అమొలాయిడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.

  • ఇందులో 8 జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ ఉంది.

  • 50 ఎంపీ కెమెరా ఉంది.

  • మిగిలిన ఫీచర్స్ పీ4 ప్రో ఫోన్‌లో ఉన్నవే ఉంటాయి.

రియల్ ‌మీ పీ4 ప్రో ధరలు

రియల్ ‌మీ పీ4 ధర 24,999 నుంచి మొదలవుతుంది. 8GB + 128GB మోడల్ ధర 24,999లుగా ఉంది. 8GB + 256GB 26,999 రూపాయలుగా ఉంది. 12GB + 256GB 28,999 రూపాయలుగా ఉంది. అయితే, ఈ ఫోన్లు ఇండియాలో ఆగస్టు 27వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి.


రియల్ మీ పీ4 ధరలు

6GB + 128GB ధర 18,499 రూపాయలుగా ఉంది. 8GB + 128GB వేరియంట్ ధర 19,499 రూపాయలుగా ఉంది. 8GB + 256GB వేరియంట్ ధర 21,499 రూపాయలుగా ఉంది. ఆగస్టు 25 నుంచి ఈ మోడల్ భారతదేశంలో అందుబాటులో ఉంటుంది.


ఇవి కూడా చదవండి

కర్నూలులో తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురు చిన్నారుల మృతి

నిద్రలో ఉండగా శరీరంపైకి పాము.. ఆ యువకుడు ఏం చేశాడంటే..

Updated Date - Aug 20 , 2025 | 09:08 PM