Share News

Young Man And A Snake: నిద్రలో ఉండగా శరీరంపైకి పాము.. ఆ యువకుడు ఏం చేశాడంటే..

ABN , Publish Date - Aug 20 , 2025 | 06:57 PM

Young Man And A Snake: గోవింద రాత్రి తన ఇంట్లో నిద్రపోతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఓ పాము అతడిపైకి పాకింది. దీంతో అతడికి మెలుకువ వచ్చింది. శరీరంపై పాము ఉండటం చూసి అతడు షాక్ అయ్యాడు.

Young Man And A Snake: నిద్రలో ఉండగా శరీరంపైకి పాము.. ఆ యువకుడు ఏం చేశాడంటే..
Young Man And A Snake

పామంటే ఎవరికి మాత్రం భయం ఉండదు చెప్పండి. అడుగుల దూరంలో పామును చూడగానే.. కాళ్లు ఆటోమేటిక్‌గా పరుగులు మొదలెడతాయి. పాము అని వినిపించినా చాలు గుండెల్లో భయం మొదలవుతుంది. మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీలో.. పడుకున్న యువకుడి శరీరంపైకి పాము ఎగబాకింది. శరీరంపై ఎదో పాకుతున్నట్లు అనిపించి అతడు కళ్లు తెరిచాడు. మీద పాము ఉండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే పామును తలను గట్టిగా నొక్కిపట్టాడు. భయంతో ఏడ్చుకుంటూ ఆస్పత్రికి పరుగులు తీశాడు.


తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. షాక్ అయ్యేంతలా ఏం జరిగిందో తెలియాలంటే.. పూర్తి స్టోరీ తెలుసుకోవాల్సిందే. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్, తిస్‌గానా గ్రామానికి చెందిన 32 ఏళ్ల గోవింద రాత్రి తన ఇంట్లో నిద్రపోతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఓ పాము అతడిపైకి పాకింది. దీంతో అతడికి మెలుకువ వచ్చింది. శరీరంపై పాము ఉండటం చూసి అతడు షాక్ అయ్యాడు. భయంతో గుండెలు ఝల్లుమన్నాయి. వెంటనే పాము తలను చేత్తో పట్టుకున్నాడు. గట్టిగా అరవసాగాడు.


అతడి అరుపులు విని కుటుంబసభ్యులు అక్కడికి వచ్చారు. అతడి చేతిలో పామును చూసి వారు షాక్ అయ్యారు. గోవింద అరుస్తూ.. ఏడుస్తూ ఉంటే పాము అతడ్ని కరిచిందని అనుకున్నారు. వెంటనే అతడ్ని తీసుకుని మాదవర కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లారు. గోవింద అక్కడికి వెళ్లగానే ‘డాక్టర్ నన్ను కాపాడండి. పాము నన్ను కరిచింది’ అంటూ ఏడవటం మొదలెట్టాడు. డాక్టర్లు అతడ్ని పరీక్షించారు. పాము అతడ్ని కరవలేదని తేలింది. పామును దూరంగా తీసుకెళ్లి వదిలేయమని చెప్పారు. అతడు పామును దూరంగా తీసుకెళ్లి పడేశాడు. అయితే, ఆ పాములో చలనం లేదు. చచ్చిపోయింది. ఆ యువకుడు ప్రాణ భయంతో పాము తలను అరగంట పాము పట్టుకోవటంతో అది చనిపోయింది.


ఇవి కూడా చదవండి

ట్రంప్ టారిఫ్ వార్.. ఇండియాకు రష్యా బంపర్ ఆఫర్..

బెట్టింగ్ యాప్స్‌పై కేంద్రం బిల్లు.. సజ్జనార్ ఏమన్నారంటే..

Updated Date - Aug 20 , 2025 | 07:10 PM