Share News

5 Children Drowned: కర్నూలులో తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురు చిన్నారుల మృతి

ABN , Publish Date - Aug 20 , 2025 | 08:09 PM

5 Children Drowned: ఆ నీటి కుంట భారీ వర్షాల కారణంగా నీటితో నిండిపోయి ఉంది. లోతు గురించి ఆ పిల్లలు ఆలోచించలేదు. ఆరుగురు చిన్నారులు నీటిలోకి దూకారు. ఈ క్రమంలో నీటిలో మునిగిపోయారు.

5 Children Drowned: కర్నూలులో తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురు చిన్నారుల మృతి
5 Children Drowned:

కర్నూలు జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ఆరుగురు చిన్నారుల ప్రాణం తీసింది. నీటి కుంటలోకి దిగిన ఆ ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఆస్పరి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. చిగలి గ్రామానికి చెందిన ఐదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఊరి బయట ఉన్న కొండ ప్రాంతంలోని నీటి కుంట దగ్గరకు ఈత కొట్టడానికి వెళ్లారు.


ఆ నీటి కుంట భారీ వర్షాల కారణంగా నీటితో నిండిపోయి ఉంది. లోతు గురించి ఆ పిల్లలు ఆలోచించలేదు. ఆరుగురు చిన్నారులు నీటిలోకి దూకారు. ఈ క్రమంలో నీటిలో మునిగిపోయారు. గట్టున ఉన్న విద్యార్థి వెంటనే ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. గ్రామంలోని వారికి విషయం చెప్పాడు. గ్రామస్తులు పరుగు, పరుగున కుంట దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే ఘోరం జరిగిపోయింది. నీటిలోకి దిగిన ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తులు వారి మృతదేహాలను బయటకు తీశారు. ఆరుగురు చిన్నారుల మృతితో చిగలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

నీటికుంటలో మునిగి 5వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు చనిపోవటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారుల మృతి వారి తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగిల్చిందని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

నిద్రలో ఉండగా శరీరంపైకి పాము.. ఆ యువకుడు ఏం చేశాడంటే..

రాజీవ్ ప్రతాప్ రూడీతో చేతులు కలిపిన రాహుల్

Updated Date - Aug 20 , 2025 | 08:15 PM