Share News

Google Veo 3 India Launch: ఇండియాలో గూగుల్ వియో3 ప్రారంభం.. టెక్స్ట్, చిత్రాలతోనే వీడియో క్రియేషన్

ABN , Publish Date - Jul 04 , 2025 | 02:53 PM

వీడియో క్రియేటర్లకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. గూగుల్ తాజాగా ఏఐ వీడియో జనరేషన్ మోడల్ వియో 3 (Veo 3)ని ఇప్పుడు భారత్‌లో కూడా అధికారికంగా విడుదల చేసింది. దీని స్పెషల్ ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Google Veo 3 India Launch: ఇండియాలో గూగుల్ వియో3 ప్రారంభం.. టెక్స్ట్, చిత్రాలతోనే వీడియో క్రియేషన్
Google Veo 3 India Launch

వీడియో క్రియేటర్లకు గుడ్ న్యూస్ వచ్చింది. గూగుల్ తన అత్యాధునిక AI వీడియో జనరేషన్ మోడల్ అయిన వియో 3 (Veo 3)ని ఇండియాలో విడుదల చేసింది. ఈ టూల్ మొదట Google I/O 2025లో ప్రదర్శించబడగా, ఇప్పుడు గెమిని యాప్‌లో Google AI Pro సబ్‌స్క్రిప్షన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇండియన్ క్రియేటర్లు ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో ట్రెండ్ అవుతున్న వీడియోలను కూడా యాక్సెస్ చేయవచ్చు.


ట్రయల్‌ సౌకర్యం కూడా..

వియో 3లో కేవలం టెక్స్ట్ లేదా ఇమేజ్ ప్రాంప్ట్‌ల ద్వారా 8 సెకన్ల 720p రిజల్యూషన్ వీడియోలను సృష్టించుకోవచ్చు. ఇందులో మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్‌లు, సింథసైజ్డ్ స్పీచ్ కూడా ఉంటాయి. ఇండియాలో Google AI Pro సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.1,999 ఉండగా, ఒక నెల ఉచిత ట్రయల్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా రోజుకు మూడు వీయో 3 ఫాస్ట్ వీడియోలను జనరేట్ చేసుకోవచ్చు. ఈ పరిమితి చేరుకున్న తర్వాత, యూజర్లు వియో 2 మోడల్‌కు మారతారు.


కంటెంట్‌ను నిరోధించడానికి..

సబ్‌స్క్రిప్షన్‌లో AI ఫిల్మ్‌మేకింగ్ యాప్ ఫ్లో, నోట్‌బుక్‌LM ప్లస్, Google వర్క్‌స్పేస్ యాప్‌లలో గెమిని అసిస్టెంట్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. వియో 3 ద్వారా సృష్టించబడిన అన్ని వీడియోలు విజిబుల్, ఇన్‌విజిబుల్ సింథ్‌ఐడీ వాటర్‌మార్క్‌లతో గుర్తించబడతాయి. ఇవి ఏఐ జనరేటెడ్ కంటెంట్‌ను అని స్పష్టంగా సూచిస్తాయి. Google రెడ్ టీమింగ్, కంటెంట్ మోడరేషన్ ద్వారా హానికరమైన లేదా తప్పుడు కంటెంట్‌ను నిరోధించడానికి చర్యలు తీసుకుంటోంది.


అనేక దేశాల్లో..

ఈ ఫీచర్ ఇప్పటికే అమెరికా సహా పలు దేశాల్లో ఉండగా, తాజాగా ఇండియాలో కూడా రిలీజ్ చేశారు. ఈ ఫీచర్ ప్రధానంగా ఇండియన్ కంటెంట్ క్రియేటర్లు, ఎడ్యుకేటర్లు, మార్కెటర్లు, వీడియో కంటెంట్‌ సృష్టించేవారికి చక్కగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా తక్కువ సమయంలోనే మంచి వీడియోలను సృష్టించుకోవచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి.


ఇవి కూడా చదవండి

చమురు తీసుకుంటే భారత్‎పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్


రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 04 , 2025 | 02:54 PM