AI: అతిగా ఏఐ వాడుతున్నారా.. అయితే మీ పని మటాష్..
ABN , Publish Date - May 01 , 2025 | 06:36 PM
AI Effects On Human: అన్ని రంగాల్లో ఏఐ తన సత్తా చాటుతోంది. మనుషుల ఆలోచనలకు ఏఐ రూపం ఇస్తోంది. సాధారణ మనుషులు గంటలు, గంటలు కష్టపడి చేసే పనిని.. ఏఐ నిమిషాల్లో చేసేస్తోంది. ఏఐ వాడకం వల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

2023 ఎండింగ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతీ రంగంలో ఏఐ తన సత్తా చాటుతోంది. ఆఖరికి వైద్య రంగంలోనూ ఏఐ తనకు తానే సాటి అనిపించుకుంటోంది. సాధారణ మనుషులు గంటలు, గంటలు కష్టపడి చేసే పనిని.. ఏఐ నిమిషాల్లో చేసేస్తోంది. ఏఐ వాడకం వల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఏఐని అతిగా వాడటం వల్ల మానసికంగా నష్టం తప్పదట. ఏఐ మన ఆలోచనా శక్తిని చంపేస్తుందట.
తాజా పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కార్పోరేట్ ఫోర్ సైట్ అండ్ సూటబులిటీ ప్రకారం.. తరచుగా ఏఐ వాడటం వల్ల ఆలోచనా శక్తి నశిస్తుందట. క్రిటికల్ థింకింగ్ దెబ్బతింటుందట. ఏఐ అతిగా వాడటం వల్ల మానసికంగా మనిషి పరిస్థితి దిగజారి పోయే అవకాశం ఉందని ఆ పరిశోధనల్లో వెల్లడైంది. ఏఐపై ఆధారపడటం పరిమితంగా ఉంటేనే అన్ని రకాలుగా మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రాణాలు కాపాడుతున్న ఏఐ
వైద్య రంగంలో ఏఐ సంచలనాలు సృష్టిస్తోంది. డాక్టర్లు సైతం కనిపెట్టలేని రోగాలను కనిపెడుతోంది. ఇక, బతకరు.. అని ఆశలు వదులుకున్న వారిని సైతం బతికిస్తోంది. అమెరికాలోని వాషింగ్టన్ నగరానికి చెందిన జోషఫ్ కొవాటెస్ అనే 37 ఏళ్ల వ్యక్తి పోయెమ్స్ సిండ్రోమ్ అనే రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఆ వ్యాధి అతడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. తను చనిపోవడం ఖాయం అని అతడు భావించాడు.
అయితే, అతడి ప్రియురాలు మాత్రం నమ్మకం కోల్పోలేదు. ఫిలడెల్ఫియాకు చెందిన డాక్టర్ డేవిడ్ సాయం తీసుకుంది. ఏఐని ఉపయోగించి చికిత్సలు అందించే డాక్టర్ల టీంలో డేవిడ్ కూడా ఓ సభ్యుడు. అతడు ఏ చికిత్స చేయాలో జోషఫ్ ప్రియురాలికి చెప్పాడు. అది వర్కవుట్ అయింది. జోసఫ్ ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్ర దాడి.. తొలిసారి స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
Viral Video: అక్క ప్రియుడిపై తమ్ముళ్ల దారుణం.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా..