Share News

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్ర దాడి.. తొలిసారి స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

ABN , Publish Date - May 01 , 2025 | 06:18 PM

Pahalgam Terror Attack: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉగ్రదాడిపై తొలిసారి స్పందించారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకొని శిక్షిస్తామన్నారు. కాశ్మీర్ ఉగ్రవాద చర్యకు గట్టి సమాధానం ఇస్తున్నామని అన్నారు. ఉగ్రవాదులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్ర దాడి.. తొలిసారి స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
Pahalgam Terror Attack

జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో చోటుచేసుకున్న ఉగ్రదాడిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తొలిసారి స్పందించారు. ఉగ్రవాదులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని స్పష్టం చేశారు. అమిత్ షా మాట్లాడుతూ.. ‘ ఉగ్రవాదాన్ని అంతం చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పడం ఖాయం. ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకొని శిక్షిస్తాం. కాశ్మీర్ ఉగ్రవాద చర్యకు గట్టి సమాధానం ఇస్తున్నాం. దాడి చేసి విజయం సాధించామని అనుకుంటే అది పొరపాటే. ఇది మోదీ సర్కార్. మోదీ సర్కార్ ఎవరినీ వదిలి పెట్టదు. వెంటాడి వెంటాడి అంతం చేస్తుంది. పహల్గామ్‌లో అమాయకుల చావులకు కారణమైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే’ అని అన్నారు.


రెండు రోజుల ముందే బైసరన్ లోయకు..

పర్యాటకులపై దాడికి రెండు రోజుల ముందే ఉగ్రవాదులు బైసరన్ లోయకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఉగ్రవాదులు మొత్తం మూడు చోట్ల మారణకాండ సృష్టించాలని భావించారట. అరు వ్యాలీ, ఎమ్మూజ్ మెంట్ పార్క్, బేతాబ్ వ్యాలీలలో దాడికి పాల్పడాలని అనుకున్నారట. ఈ ప్రదేశాలలో భద్రతా దళాలు ఉండటం వల్ల వారి ప్రణాళిక విఫలమైందని సమాచారం. బైసరన్ లోయ దాడికి సంబంధించి ఉగ్రవాదులకు నలుగురు భూగర్భ కార్మికులు సహాయం చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రదాడికి సంబంధించి అధికారులు దాదాపు 180 మందిని విచారిస్తున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి

Viral Video: అక్క ప్రియుడిపై తమ్ముళ్ల దారుణం.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా..

Actress Chhaya Kadam: చిక్కుల్లో ప్రముఖ నటి.. వైల్డ్ లైఫ్ కేసు..

Updated Date - May 01 , 2025 | 06:27 PM