Viral Video: అక్క ప్రియుడిపై తమ్ముళ్ల దారుణం.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా..
ABN , Publish Date - May 01 , 2025 | 05:00 PM
Delhi Samaypur Badli: తమ అక్కకు దూరంగా ఉండాలంటూ గతంలో కొన్ని సార్లు లావిష్‌కు వార్నింగ్ ఇచ్చారు. అయితే, లావిష్ మాత్రం వారి వార్నింగ్ పట్టించుకోలేదు. యువతితో కలిసి తిరుగుతూ ఉన్నాడు. దీంతో యువతి తమ్ముళ్లు ఆగ్రహానికి గురయ్యారు.
తమ అక్కను ప్రేమిస్తున్నాడన్న కోపంతో ఇద్దరు మైనర్లు దారుణానికి ఒడిగట్టారు. వార్నింగ్ ఇచ్చినా వినకపోవడంతో అక్క ప్రియుడ్ని చంపడానికి సిద్దమయ్యారు. స్నేహితుడితో కలిసి ప్లాన్ వేశారు. అక్క ప్రియుడ్ని దొరకబుచ్చుకుని నడిరోడ్డుపై కత్తులతో దాడి చేశారు. ఇష్టం వచ్చినట్లు పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ సంఘటన ఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన లావిష్ తన కటుంబంతో కలిసి రానా పార్క్‌లోని లిబాస్‌పూర్‌లో ఉంటున్నారు. లావిష్ తండ్రి అనిల్ కుమార్ పిజ్జా షాపు నిర్వహిస్తున్నాడు.
ఇక, లావిష్ బదార్‌పూర్‌కు చెందిన ఓ బిల్డర్ దగ్గర పని చేస్తున్నాడు. షాలీమార్ భాగ్‌లోని లయన్ బ్లడ్ సెంటర్‌లో పని చేస్తున్న ఓ యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ ప్రేమ విషయం యువతి ఇద్దరు తమ్ముళ్లకు తెలిసింది. వారు ఈ ప్రేమను వ్యతిరేకించారు. తమ అక్కకు దూరంగా ఉండాలంటూ గతంలో కొన్ని సార్లు లావిష్‌కు వార్నింగ్ ఇచ్చారు. అయితే, లావిష్ మాత్రం వారి వార్నింగ్ పట్టించుకోలేదు. యువతితో కలిసి తిరుగుతూ ఉన్నాడు. దీంతో యువతి తమ్ముళ్లు ఆగ్రహానికి గురయ్యారు. అతడ్ని చంపాలని నిశ్చయించుకున్నారు. మరో మిత్రుడి సాయం తీసుకున్నారు.
మంగళవారం నాలుగు గంటల సమయంలో అతడిపై దాడికి తెగబడ్డారు. పట్టపగలు నడిరోడ్డుపై అతడ్ని కత్తులతో పొడిచారు. అనంతరం అక్కడినుంచి పరుగులు తీశారు. లావీష్‌కు వారి నుంచి తప్పించుకోవడానికి పరుగులు పెట్టాడు. ఒంటి నిండా గాయాలతో ఉన్న అతడ్ని చూసిన పాదచారులు.. వెంటనే దగ్గరలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 4.30 గంటల సమయంలో ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం అందింది. అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
Actress Chhaya Kadam: చిక్కుల్లో ప్రముఖ నటి.. వైల్డ్ లైఫ్ కేసు..
భర్త గడ్డం అడ్డం అయింది.. మరిదితో పరారైన వదిన