Share News

భర్త గడ్డం అడ్డం అయింది.. మరిదితో పరారైన వదిన

ABN , Publish Date - May 01 , 2025 | 03:25 PM

Meerut Woman: వారు సర్థిచెప్పేవారు. అయితే, పెళ్లి తనకు పూర్తి ఇష్టం లేకుండా జరిగిందని, గడ్డం తీసే వరకు భర్తతో ఉండలేనని అర్షి చెప్పింది. దీంతో గొడవలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే అర్షి.. భర్త తమ్ముడితో సంబంధం పెట్టుకుంది.

 భర్త గడ్డం అడ్డం అయింది.. మరిదితో పరారైన వదిన
Meerut Woman

గడ్డం ఓ భర్త కొంపముంచింది. అతడ్ని భార్యకు దూరం చేసింది. గడ్డం కారణంగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. క్లీన్ షేవ్ చేసుకోమని భార్య గొడవపడుతూ ఉండేది. భర్త ఆమెను పట్టించుకోలేదు. చివరికి అదే అతడి కొంప ముంచింది. క్లీన్ షేవ్ చేసుకున్న అతడి తమ్ముడితో భార్య లేచిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించి పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, మీరట్‌లోని ఉజ్వల్ గార్డెన్ కాలనీకి చెందిన మౌళానా షాకీర్ అదే ప్రాంతానికి చెందిన ఆర్షి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.


ఏడు నెలల క్రితం వీరిద్దరి పెళ్లి అయింది. ఆర్షి ఇంటర్ పూర్తి చేసింది. డిగ్రీ చదువుతోంది. పెళ్లయిన నాటినుంచి ఆర్షికి షాకీర్‌కు గడ్డం విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. గడ్డం తీసేయమని ఆమె అడుగుతూ ఉండేది. ఇందుకు షాకీర్ ఒప్పుకునే వాడు కాదు. దీంతో ఇద్దరి మధ్యా తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ గొడవల పంచాయతీ ఇరు కుటుంబాలకు కూడా చేరేది. వారు సర్థిచెప్పేవారు. అయితే, పెళ్లి తనకు పూర్తి ఇష్టం లేకుండా జరిగిందని, గడ్డం తీసే వరకు భర్తతో ఉండలేనని అర్షి చెప్పింది. దీంతో గొడవలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే అర్షి.. భర్త తమ్ముడితో సంబంధం పెట్టుకుంది.


అతడు క్లీన్ షేవ్ చేసుకుని అందంగా ఉంటాడు. ఫిబ్రవరి 3వ తేదీన ఇద్దరూ ఇళ్లు విడిచి పారిపోయారు. ఈ విషయం తెలిసి షాకీర్‌తో పాటు మిగిలిన కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. షాకీర్ వారిద్దరినీ పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. కానీ, వారు దొరకలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులను ఆశ్రయించాడు. భార్య, తమ్ముడు కనిపించటం లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అజ్ణాతంలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తూ ఉన్నారు.


ఇవి కూడా చదవండి

Black Alien: ఏలియన్‌గా మారటం కోసం చేతి వేళ్లు, నాలుక కోయించుకున్నాడు..

Sandstorm: వామ్మో.. భారీ ఇసుక తుఫాను.. నివాసాలను ఎలా ముంచేస్తుందో చూడండి..

Updated Date - May 01 , 2025 | 03:30 PM