Share News

Yuzvendra Chahal: ఛాహల్ హ్యాట్రిక్.. వరుస బంతుల్లో మూడు వికెట్లు ఎలా తీశాడో చూడండి

ABN , Publish Date - Apr 30 , 2025 | 10:36 PM

పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర ఛాహల్ మరో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. వేగంగా పరుగులు చేస్తున్న చెన్నై జోరుకు బ్రేకులు వేశాడు. కీలకమైన 19వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు.

Yuzvendra Chahal: ఛాహల్ హ్యాట్రిక్.. వరుస బంతుల్లో మూడు వికెట్లు ఎలా తీశాడో చూడండి
Yuzvendra Chahal

పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర ఛాహల్ మరో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. వేగంగా పరుగులు చేస్తున్న చెన్నై జోరుకు బ్రేకులు వేశాడు. కీలకమైన 19వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.


19వ ఓవర్ రెండో బంతికి ధోనీని అవుట్ చేశాడు. మూడో బంతికి రెండు పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత వరుస బంతుల్లో దీపక్ హుడా, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్‌లను అవుట్ చేసి హ్యాట్రిక్ సంపాదించాడు. ఈ సీజన్‌లో ఇదే తొలి హ్యాట్రిక్. కాగా, యుజ్వేంద్ర ఛాహల్ కెరీర్‌లో ఇది రెండో హ్యాట్రిక్. 200+ పరుగులు చేస్తుందనుకున్న చెన్నై ఛాహల్ దెబ్బకు 190 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఛాహల్ అనే సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి..

MS Dhoni: చెన్నై టీమ్ మెరుగుపడాలంటే.. ధోనీ రిటైర్ కావడం మంచిది: ఆడమ్ గిల్‌క్రిస్ట్


IPL 2025 CSK vs PBKS: చెన్నైకు లాస్ట్ ఛాన్స్.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే


మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 30 , 2025 | 10:36 PM