Share News

Vaibhav Suryavanshi: వైభవ్‌కి అత్యున్నత పురస్కారం.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్

ABN , Publish Date - Dec 26 , 2025 | 01:18 PM

టీమిండియా యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. 14 ఏళ్లకే వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ చిచ్చరపిడుగును.. ప్రధాన్‌ మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌ వరించింది

Vaibhav Suryavanshi: వైభవ్‌కి అత్యున్నత పురస్కారం.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. 14 ఏళ్లకే వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ చిచ్చరపిడుగును.. ప్రధాన్‌ మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌ (Pradhan Mantri Rashtriya Bal Puraskar) వరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అతడు శుక్రవారం ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని సమావేశం కానున్నాడు. క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు గాను ఈ అరుదైన గౌరవం లభించింది. విజయ్ హజారే ట్రోఫీలో ఇటీవల ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ, 84 బంతుల్లో 190 పరుగులతో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.


బిహార్‌కు చెందిన వైభవ్‌ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి.. రంజీల్లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడి (12)గా రికార్డు సాధించాడు. అలానే ఐపీఎల్-2025లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫు వేగవంతమైన సెంచరీ నమోదు చేయడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచాడు. గుజరాత్‌ టైటాన్స్‌ వంటి పటిష్ట బౌలింగ్‌ విభాగం ఉన్న జట్టుపై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి.. ఐపీఎల్ చరిత్రలోనే చిన్న వయసులో ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం భారత అండర్‌-19 జట్టు తరఫున వైభవ్ ఆడుతున్నాడు.


ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలోనూ అండర్-19 వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీలు నమోదు చేశాడు. ఇటీవల అండర్‌-19 ఆసియా కప్‌-2025లోనూ, అలానే తాజాగా దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లోనూ వైభవ్ దుమ్ములేపాడు. బుధవారంఅరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్‌(Vaibhav Suryavanshi).. 84 బంతుల్లో 190 పరుగులు సాధించాడు. తద్వారా లిస్ట్‌-ఎ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగుల మార్కు దాటిన బ్యాటర్‌గా వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు.


ప్రతిష్టాత్మక అవార్డు

ఇలా చిన్న వయసులోనే క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్‌ సూర్యవంశీని.. పిల్లలకు అందించే అత్యున్నత పురస్కారం ప్రధాన్‌ మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌తో భారత ప్రభుత్వం సత్కరించింది. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న వైభవ్‌(Vaibhav Suryavanshi).. అనంతరం ప్రధాని మోదీతో భేటీ అవుతాడు. ప్రధాన్‌ మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌ను 5-18 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలకు సాహసం, సంస్కృతి, వాతావరణం, నవకల్పనలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడలు తదితర విభాగాల్లో అందజేస్తారు.



ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?

Vignesh Puthur Creates History: 32 ఏళ్ల రికార్డ్ బద్దలు.. చరిత్ర సృష్టించిన విజ్ఞేష్

Updated Date - Dec 26 , 2025 | 01:58 PM