AUS VS SA: చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా.. ఆసీస్‌తో భారత్ సెమీ ఫైనల్
ABN , Publish Date - Oct 25 , 2025 | 09:38 PM
ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025లో భాగంగా శనివారం ఇండోర్ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆడాయి. ఈ మ్యాచ్ లో ప్రోటీస్ ను కంగారులు చిత్తు చిత్తుగా ఓడించారు. ఆస్ట్రేలియా బౌలర్ అలానా కింగ్ (7/18) దెబ్బకు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
క్రికెట్ న్యూస్: ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025(Women’s World Cup 2025)లో భాగంగా శనివారం ఇండోర్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆడాయి. ఈ మ్యాచ్ లో ప్రోటీస్‌ను కంగారులు(Australia thrashed South Africa) చిత్తుచిత్తుగా ఓడించారు. ఆస్ట్రేలియా బౌలర్ అలానా కింగ్ (7/18) దెబ్బకు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఆ జట్టు 24 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది.
సౌతాఫ్రికా బ్యాటర్ల(South Africa women collapse)లో లారా వోల్వార్డ్ట్ (31), సినాలో జాఫ్తా (29), నాడిన్ డిక్లర్క్ (14) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇక 98 పరుగుల స్వల్ప టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి 16.5 ఓవర్లలోనే ఛేదించింది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (5), ఎలిస్ పెర్రీ (0) త్వరగానే పెవిలియన్ చేరినా.. జార్జియా వాల్ (38*), బెత్ మూనీ (42) నిలకడగా ఆడి జట్టును గెలిపించారు.
ఈ మ్యాచ్ తో సెమీ ఫైనల్ లో భారత్‌తో తలపడే జట్టు అనేది తెలిసిపోయింది. ఆస్ట్రేలియాతోనే టీమిండియా సెమీ ఫైనల్లో(South Africa women collapse) తలపడనుంది. ఆస్ట్రేలియాతోనే టీమిండియాకు మ్యాచ్ జరగడానికి కారణం ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (13), సౌతాఫ్రికా (10), ఇంగ్లాండ్ (9), భారత్ (6) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ జట్లన్నీ సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే.
ఆదివారం (అక్టోబర్ 26) భారత్ చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇందులో గెలిచినా భారత్ ఖాతాలో ఎనిమిది పాయింట్లే ఉంటాయి. అలానే ఆదివారం న్యూజిలాండ్‌తో ఇంగ్లాండ్ తలపడాల్సి ఉంది. ఇందులో గెలిచినా ఇంగ్లాండ్(England) ఖాతాలో 11 పాయింట్లే ఉంటాయి. దీంతో 13 పాయింట్లతో టేబుల్ టాపర్ గా ఉన్న ఆస్ట్రేలియాతో నాలుగో స్థానంలో ఉన్న భారత్ అక్టోబర్ 30న జరిగే సెమీస్‌లో తలపడనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Gautam Gambhir's Reaction: రోహిత్ శర్మ 50వ సెంచరీ.. గంభీర్ అదిరిపోయే రియాక్షన్
Rohit Sharma: ఫీల్డింగ్‌లోనూ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. అదెలాగంటే?