Virat Kohli Test comeback: టెస్టుల్లోకి రీఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ
ABN , Publish Date - Dec 01 , 2025 | 10:33 AM
టెస్టుల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే రాంచీ వన్డే అనంతరం ఈ వార్తలపై విరాట్ క్లారిటీ ఇచ్చాడు.
రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(virat Kohli) సూపర్ సెంచరీ(135)తో అదరగొట్టాడు. విరాట్ విశ్వరూపంతో భారత్ 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా 17 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. ఆస్ట్రేలియా టూర్‌లో మూడో వన్డేలో విరాట్ తన 'వింటేజ్ ఫామ్'ను గుర్తు చేశాడు. ఆ మ్యాచ్ లో 78 పరుగులతో అజేయంగా నిలిచాడు. అదే ఫామ్ ను సద్వేశంలో కొనసాగిస్తూ ..సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో సెంచరీతో రెచ్చిపోయాడు. ఆరంభం నుంచీ దూకుడుగా ఆడుతూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. తనలో ఆట ఇంకా చాలా ఉందనేలా విరాట్ ఇన్నింగ్స్ సాగింది. ఇదే సమయంలో టెస్టులో విఫలమైవుతున్న భారత్ జట్టులోకి విరాట్ రీఎంట్రీ(Virat Kohli Test comeback news) ఇస్తాడనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగాయి.
తాను టెస్టుల్లోకి పునరాగమనం చేస్తున్నానంటూ చక్కర్లు కొడుతున్న వార్తలకు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. రాంచీ వన్డేలో అద్భుతమైన శతకం చేసిన విరాట్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ సందర్భంగా తనకు ఎదురైన ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. భవిష్యత్తులోనూ ఒకే ఫార్మాట్‌లో ఆడతావా? మళ్లీ పునరాలోచన చేసే అవకాశం ఏమైనా ఉందా? అని వ్యాఖ్యాత అడగ్గా... తాను ఒక ఫార్మాట్‌లోనే ఆడతానని స్పష్టం చేశాడు. దీంతో టెస్టుల్లోకి రీ ఎంట్రీ అంటూ ఇప్పటి వరకు సాగుతోన్న ప్రచారానికి చెక్ పడినట్లైంది.
కోహ్లీ మాట్లాడుతూ...' గత 16 ఏళ్లుగా దాదాపు 300కిపైగా వన్డేలు ఆడాను. బంతితో నేనెప్పుడూ టచ్‌లోనే ఉన్నాను. ప్రాక్టీస్ సమయంలోనూ హిట్టింగ్ చేయడంపై దృష్టిపెడతాను. నెట్స్‌లో నిర్విరామంగా 2 గంటలపాటు ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రభావం తప్పకుండా మ్యాచ్‌లో ఆటతీరుపై పడుతుంది. ఆడుతూ ఉంటే ఫామ్‌లోకి రావడం పెద్ద కష్టమేం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఉన్న అనుభవం మొత్తాన్ని వినియోగించాల్సిన అవసరం ఉంది. నేనెప్పుడూ శారీరకంగా ఫిట్‌గా( Kohli fitness and form) ఉంటా. మానసికంగానూ సిద్ధమై మ్యాచ్‌లు ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తుంటా. అలానే నేను ఒక ఫార్మాట్ లోనే ఆడతాను' అని కోహ్లీ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
రో-కో జోడీ రాహుల్‌కి బలం: బవుమా
Virat Kohli: రాంచీ వన్డేలో షాకింగ్ ఘటన.. విరాట్ కాళ్లపై పడిపోయిన అభిమాని