Share News

Aiden Markram: మా ఓటమికి అదే కారణం: సౌతాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్

ABN , Publish Date - Dec 01 , 2025 | 07:41 AM

రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ చేతిలో 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓడింది. ఈ మ్యాచ్ లో 350 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ప్రొటీస్ జట్టు.. గెలుపు కోసం చివరి వరకు పోడింది. ఓటమిపై సౌతాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్ స్పందిస్తూ..

Aiden Markram: మా ఓటమికి అదే కారణం: సౌతాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్
Aiden Markram reaction

ఇంటర్నెట్ డెస్క్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్(South Africa vs India ) జరిగింది. ఈ వన్డేలో సౌతాఫ్రికా పోరాడి ఓడింది. 17 పరుగుల తేడాతో భారత్.. ప్రొటీస్ జట్టుపై విజయం సాధించింది. స్వల్ప పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ.. సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్రమ్(Aiden Markram reaction) తన జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాడు. లక్ష్యఛేదనలో అద్భుతమైన పోరాట పటిమ కనబరిచిన జట్టును చూసి గర్వంగా ఉందని తెలిపాడు.


మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా ఓటమిపై మార్‌క్రమ్(Aiden Markram reaction) స్పందించాడు. ' మా జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. ఆటగాళ్లు తమ వంతు కృషి చేయడం గొప్పగా అనిపించింది. చివరి వరకు పోరాటం చేసి.. గెలుపును మా వైపు తిప్పుకోగలమనే ఆశతో పారాటం సాగించాము. టాప్ ఆర్డర్ వైఫల్యం(SA top order collapse) కారణంగానే మా జట్టు ఓడింది. ఛేదించే సమయంలో కొత్త బంతి కొంత బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని మాకు తెలుసు. మా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఎంతో అద్భుతంగా ఆడారు. ఒకటి, రెండు కీలక సమయాల్లో తేడాలు రావడంతో మాకు ఓటమి ఎదురైంది' అని మార్‌క్రమ్ వెల్లడించాడు.


'మొత్తం మీద మా ప్లేయర్ల ప్రయత్నం పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. మేము విజయానికి చాలా దగ్గరగా వచ్చాం. ఇది మాలోని పట్టుదలను (Character) చూపించింది. ఏ జట్టు అయినా బ్యాటింగ్ వీలైనంత లోతుగా ఉండాలని కోరుకుంటుంది. జాన్సెన్, బాష్ వంటి ఆటగాళ్లు అదే చేస్తున్నారు' అంటూ మార్‌క్రమ్(Aiden Markram) ప్రశంసించాడు. రాంచీ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. విరాట్ కోహ్లీ సెంచరీ దెబ్బకు 349 పరుగుల భారీ స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా(South Africa) జట్టు 332 పరుగులకే పరిమితమైంది. ఈ క్రమంలో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.


ఇవి కూడా చదవండి:

రో-కో జోడీ రాహుల్‌కి బలం: బవుమా

విరాట్‌కు కలిసొచ్చిన కేఎల్ కెప్టెన్సీ.. సెంచరీ రిపీట్ అవ్వనుందా?

Updated Date - Dec 01 , 2025 | 09:23 AM