Pro Kabaddi League: టైటాన్స్ రెండో ఓటమి
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:48 AM
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ జట్టుకు రెండోరోజూ కలిసిరాలేదు. శనివారం ఇక్కడ జరిగిన తమ రెండో మ్యాచ్‌లో టైటాన్స్ 35-40తో యూపీ యోధాస్ చేతిలో పరాజయం పాలైంది...
ప్రొ కబడ్డీలో యోధాస్ గెలుపు
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ జట్టుకు రెండోరోజూ కలిసిరాలేదు. శనివారం ఇక్కడ జరిగిన తమ రెండో మ్యాచ్‌లో టైటాన్స్ 35-40తో యూపీ యోధాస్ చేతిలో పరాజయం పాలైంది. యోధాస్ తరఫున గగన్ గౌడ 14 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో నాలుగు బోనస్ పాయింట్లు ఉండడం విశేషం. కెప్టెన్ సుమిత్ సాంగ్వాన్ 8, గుమన్ సింగ్ 7 పాయింట్లు స్కోర్ చేశారు. టైటాన్స్ జట్టులో విజయ్ మాలిక్ రైడ్ ద్వారా పది పాయింట్లు, ట్యాకిలింగ్‌లో ఒకటి, బోనస్ రూపంలో మరో మూడు పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో యు ముంబా 6-5తో గుజరాత్ జెయింట్స్‌పై టైబ్రేకర్‌లో గెలిచింది. అంతకుముందు ఇరుజట్లు హోరాహోరీగా పోరాడడంతో 29-29తో స్కోరు సమమైంది. దీంతో టైబ్రేక్‌లో ఫలితం యు ముంబాను వరించింది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి