Shanghai Masters 2025: అన్‌సీడెడ్‌గా వచ్చాడు ట్రోఫీ పట్టేశాడు
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:29 AM
టోర్నీ ఆరంభానికి ముందు అతనో అనామక ఆటగాడు.. పైగా, ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అతని స్థానం 204.. ఇంకేం, తొలి మ్యాచ్ నెగ్గడమే గగనం అనుకున్నారంతా! కానీ, అందరి అనుమానాలను...
షాంఘై మాస్టర్స్‌లో వాలెంటిన్ సంచలనం
షాంఘై (చైనా): టోర్నీ ఆరంభానికి ముందు అతనో అనామక ఆటగాడు.. పైగా, ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అతని స్థానం 204.. ఇంకేం, తొలి మ్యాచ్ నెగ్గడమే గగనం అనుకున్నారంతా! కానీ, అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ దిగ్గజం జొకోవిచ్‌లాంటి స్టార్లను చిత్తుచేస్తూ ముందుకు సాగిన అతను.. ఏకంగా టోర్నీ చాంపియన్‌గా నిలిచి అదరహో అనిపించాడు. అతనే, మొనాకోకు చెందిన 26 ఏళ్ల వాలెంటిన్ వాచెరోట్. ఏమాత్రం అంచనాలు లేని వాలెంటిన్.. షాంఘై మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సింగిల్స్ ట్రోఫీ నెగ్గి సరికొత్త రికార్డు నమోదు చేశాడు. క్వార్టర్స్‌లో పదోసీడ్ హోల్గర్ రూన్‌కు, సెమీ్‌సలో నాలుగో సీడ్ జొకోవిచ్‌కు షాకిచ్చిన వాలెంటిన్ ఫైనల్లో తనకు వరుసకు సోదరుడైన ఆర్థర్ రిండెర్‌నెచ్‌ను 4-6, 6-3, 6-3తో ఓడించి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీ చరిత్రలో టైటిల్ నెగ్గిన అతి తక్కువ ర్యాంకర్‌గా వాలెంటిన్ నయా చరిత్ర సృష్టించాడు.

గాఫ్‌కు వుహాన్ టైటిల్
అమెరికా టెన్నిస్ స్టార్ కొకొ గాఫ్.. వుహాన్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. చైనాలోని వుహాన్‌లో శనివారం జరిగిన మహిళల తుదిపోరులో మూడో సీడ్ గాఫ్ 6-4, 7-5తో తన దేశానికే చెందిన జెస్సికా పెగులపై గెలిచి ట్రోఫీ అందుకుంది. 21 ఏళ్ల గాఫ్‌కిది ఈ ఏడాది రెండో టైటిల్. అంతకుముందు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది.
ఇవి కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
For More National News And Telugu News