Share News

Andhra Premier League 2025: ఏపీఎల్‌ విజేత వారియర్స్‌

ABN , Publish Date - Aug 24 , 2025 | 04:42 AM

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ ట్రోఫీని తుంగభద్ర వారియర్స్‌ కైవసం చేసుకుంది. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో తుంగభద్ర వారియర్స్‌ ఐదు వికెట్ల తేడాతో అమరావతి రాయల్స్‌పై...

Andhra Premier League 2025: ఏపీఎల్‌ విజేత వారియర్స్‌

విశాఖపట్నం స్పోర్ట్స్‌ (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ ట్రోఫీని తుంగభద్ర వారియర్స్‌ కైవసం చేసుకుంది. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో తుంగభద్ర వారియర్స్‌ ఐదు వికెట్ల తేడాతో అమరావతి రాయల్స్‌పై గెలుపొందింది. తొలుత రాయల్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 194 పరుగులు చేసింది. కెప్టెన్‌ విహారి (51) అర్ధ సెంచరీ సాధించగా.. ప్రణీత్‌ (47) ఫర్వాలేదని పించాడు. శశికాంత్‌ 3, స్టీఫెన్‌ 2 వికెట్లు తీశారు. ఛేదనలో వారియర్స్‌ 18 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసి గెలుపొందింది. జ్ఞానేశ్వర్‌ (66), రోహిత్‌ (63) అర్ధ సెంచరీలతో చెలరేగారు. విజేతకు రూ.35 లక్షలు, రన్నరప్‌నకు రూ.20 లక్షలు లభించాయి.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 24 , 2025 | 04:42 AM