T20 World Cup 2026: భారత జట్టులోకి ఊహించని ప్లేయర్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:07 PM
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2026కు సంబంధించిన భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ ఎంపికలో గిల్ కు బిగ్ షాక్ తగలగా.. ఎవ్వరూ ఊహించని ప్లేయర్ ను బీసీసీఐ సెలెక్ట్ చేసింది. అతడు ఎవరంటే...
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్(T20 World Cup2026)కు సంబంధించి భారత జట్టును బీసీసీఐ ఇవాళ(శనివారం) ప్రకటించింది. సూర్య కుమార్ యాదవ్ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అలానే ఆల్ రౌండర్ అక్షర పటేల్ ను వైస్ కెప్టెన్ గా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇదే సమయంలో ఎవ్వరూ ఊహించని ప్లేయర్ ను భారత జట్టుకు ఎంపిక చేసింది బీసీసీఐ. వరల్డ్ కప్ 2026 భారత జట్టు ప్రకటనలో శుభ్‌మన్ గిల్ ఎంపిక చేయకపోవడం, ఎవరూ ఊహించని ప్లేయర్ ను సెలక్ట్చేయడం క్రికెట్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది. మరి.. ఆ ప్లేయర్ ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఈ ఏడాది ఆసియాకప్(Asia Cup 2025)తో తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా గిల్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. తొలి మూడు మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమైన గిల్‌ను ఆఖరి రెండు టీ20లకు గాయం పేరిట భారత జట్టు మెనెజ్మెంట్ పక్కన పెట్టింది. దీంతో అతడి స్దానంలో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ అద్భుతంగా ఆడాడు. ఐదో టీ20 మ్యాచ్ లో కేవలం 22 బంతుల్లో 37 పరుగులు చేశాడు. దీంతో ఇకపై సంజూ(Sanju Samson)ను ఓపెనర్‌గా కొనసాగించాలని మెనెజ్మెంట్ నిర్ణయించింది. ఈ కారణంతోనే గిల్‌ను ప్రపంచ కప్ జట్టు ఎంపిక చేయలేదు. ఇదే విషయాన్ని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ధ్రువీకరించాడు. గిల్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడని, గత టీ20 వరల్డ్‌కప్‌లో కూడా అతడు ఆడలేదని అజిత్ తెలిపాడు.
కిషన్ అనూహ్య ఎంట్రీ:
ఇక వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ రెండేళ్ల తర్వాత భారత జట్టుకు ఎంపికయ్యాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT 2026)లో జార్ఖండ్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా కిషన్ దుమ్ములేపాడు. ఈ టోర్నీలో హర్యానాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సూపర్ సెంచరీతో అందరిని ఆకట్టుకున్నాడు. SMAT 2026 టోర్నీలో సూఫర్ ఫామ్ లో ఉన్న కిషన్‌ను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకుంది. అయితే సౌతాఫ్రికాతో ఆడిన భారత టీ20 జట్టులో భాగంగా ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ జితీష్ శర్మకు సెలక్టర్లు షాకిచ్చారు. అతడి స్ధానంలోనే సెకండ్ వికెట్ కీపర్‌గా ఉన్న కిషన్‌ను ఎంపిక చేశారు. కిషన్ చివరగా భారత్ తరపున 2023లో ఆడాడు. దేశవాళీ టోర్నీల్లో అద్భుతప్రదర్శన కనబరుస్తుండడంతో సెలక్టర్లు తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అదేవిధంగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉన్న రింకూ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ప్రపంచ కప్ 2026కు ఎంపికైన జట్టు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో తలపడనుంది.
ఇవీ చదవండి:
ఓ ఆటగాడు గాయపడితే సంజూని ఆడిస్తారా?.. రవిశాస్త్రి తీవ్ర అసహనం
నేను కోలుకుంటున్నా.. త్వరలోనే మైదానంలోకి వస్తా: యశస్వి జైస్వాల్