SRH vs DC: ఢిల్లీ మ్యాచ్‌కు ముందే హైదరాబాద్ జట్టులో కీలక ప్లేయర్ మార్పు..కారణమిదే..
ABN , Publish Date - May 05 , 2025 | 12:14 PM
నేడు ఢిల్లీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఇదే సమయంలో స్మరన్ స్థానంలో హర్ష్ దుబేను హైదరాబాద్ జట్టు తీసుకుంది. అయితే ఈ ఆటగాడు ఆకట్టుకుంటాడా, తన ట్రాక్ రికార్డ్ ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ 2025 ఇప్పుడు దాదాపు చివరి దశకు వచ్చేసింది. కానీ ఈ సమయంలో కూడా ఆటగాళ్ల భర్తీ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టులోకి ఒక ఆటగాడిని చేర్చుకుంది. ఈ సీజన్ మిగిలిన మ్యాచుల కోసం విదర్భ ఆల్ రౌండర్ హర్ష్ దుబే (Harsh Dubey) తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)లో చేరాడు. గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్న స్మరాన్ రవిచంద్రన్ స్థానంలో 22 ఏళ్ల దుబేను జట్టులోకి తీసుకున్నారు. దూబేను హైదరాబాద్ జట్టు రూ. 30 లక్షలకు తీసుకుంది.
గాయం కారణంగా
హర్ష్ దుబే దేశవాళీ క్రికెట్‌లో విదర్భకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు అతను 16 T20లు, 20 లిస్ట్ A, 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో మొత్తం 127 వికెట్లు పడగొట్టాడు. దీంతోపాటు 941 పరుగులు చేశాడు. గత సీజన్‌లో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో దుబే 6 మ్యాచ్‌ల్లో 7.50 ఎకానమీ రేటుతో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. మహారాష్ట్రలో జన్మించిన దుబే ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్‌లో మొత్తం 9 అర్ధ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 76 పరుగులు. అంతకుముందు ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో స్మరాన్ రవిచంద్రన్‌ను జట్టులోకి తీసుకున్నారు. రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత గాయం కారణంగా జంపా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
రంజీ ట్రోఫీలో మెరిసిన దుబే
రంజీ ట్రోఫీలో ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్ష్ దుబే ఇటీవల రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2024-25 సీజన్‌లో అతను 10 మ్యాచ్‌ల్లో 2.66 ఎకానమీ రేటుతో 69 వికెట్లు పడగొట్టాడు. ఆ క్రమంలో 69 వికెట్లు తీసిన బీహార్‌కు చెందిన అశుతోష్ అమన్ రికార్డును బద్దలు కొట్టాడు. హర్ష్ దుబే ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు 7 సార్లు, మ్యాచ్‌లో పది వికెట్లు 2 సార్లు పడగొట్టాడు. అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగా, విదర్భ మూడోసారి రంజీ ఛాంపియన్‌గా నిలిచింది.
దీంతోపాటు ఫిబ్రవరిలో నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విదర్భ కేరళను ఓడించింది. SRH ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో -1.192 నికర రన్ రేట్‌తో తొమ్మిదో స్థానంలో ఉంది. తర్వాత జరిగే అన్ని మ్యాచుల్లో గెలిచినా కూడా ప్లే ఆఫ్ ఛాన్స్ కష్టమేనని చెప్పవచ్చు. ఈ క్రమంలో నేటి మ్యాచ్ గెలుస్తుందా లేదా అనేది చూడాలి మరి.
ఇవి కూడా చదవండి:
Tom Bailey: మ్యాచ్ ఆడుతున్న క్రమంలో జేబులోంచి పడిన మొబైల్.. వీడియో వైరల్
Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం
Punjab Kings: ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డ్..పట్టికలో కూడా..
Read More Business News and Latest Telugu News