ODI World Cup 2027: దక్షిణాఫ్రికాలో 44 మ్యాచ్‌లు
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:55 AM
రెండేళ్ల తర్వాత జరిగే పురుషుల వన్డే వరల్డ్‌కప్ వేదికలను క్రికెట్ సౌతాఫ్రికా (సీఎ్‌సఏ) ఖరారు చేసింది. 2027లో జరిగే ఈ మెగా టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్నాయి...
వన్డే వరల్డ్‌కప్ వేదికల ఖరారు
జొహాన్నె్‌సబర్గ్: రెండేళ్ల తర్వాత జరిగే పురుషుల వన్డే వరల్డ్‌కప్ వేదికలను క్రికెట్ సౌతాఫ్రికా (సీఎ్‌సఏ) ఖరారు చేసింది. 2027లో జరిగే ఈ మెగా టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దీంట్లో భాగంగా మొత్తం 54 మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే అత్యధికంగా 44 మ్యాచ్‌లకు సౌతాఫ్రికాలోని జొహాన్నె్‌సబర్గ్, ప్రిటోరియా, కేప్‌టౌన్, డర్బన్, గెబెరా, బ్లూమ్‌ఫోంటీన్, ఈస్ట్ లండన్, పార్ల్ వేదికలుగా ఉండనున్నాయి. మిగిలిన పది మ్యాచ్‌లు జింబాబ్వే, నమీబియాలో నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి