South Africa: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. వరల్డ్‌లోనే తొలి జట్టుగా రికార్డు
ABN , Publish Date - Nov 27 , 2025 | 02:09 PM
భారత్ తో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో దక్షిణాఫ్రికా అనేక రికార్డులను బద్దలు కొట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: స్వదేశంలో భారత్ ను టెస్టుల్లో 2-0తో సౌతాఫ్రికా(South Africa whitewashes India) వైట్‌వాష్ చేసింది. గువాహటి వేదికగా జరిగిన రెండో టెస్టులో 408 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అంతక ముందు కోల్ కత్తా టెస్టులోనూ సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. దీంతో 25 ఏళ్ల క్రితం నాటి ఫలితాన్ని పునరావృతం చేసి రెండోసారి ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలోనే ప్రొటీస్ జట్టు ఓ ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకుంది.
గువాహటి టెస్టులో 408 పరుగుల తేడాతో భారత్(Team India) ను ఓడించడంతో ప్రపంచంలో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనతను సౌతాఫ్రికా(South Africa) తన ఖాతాలో వేసుకుంది. టెస్టుల్లో భారత్‌పై 400 పైచిలుకు పరుగుల తేడాతో గెలిచిన తొలి జట్టుగా ప్రొటీస్ జట్టు చరిత్ర లిఖించింది. గతంలో నాగ్‌పూర్ వేదికగా టీమిండియాపై 342 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. అదే ఇప్పటి వరకు భారత్ భారీ తేడాతో ఓడిన రికార్డు. సౌతాఫ్రికా ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది. దీంతో భారత్ ను 400 పై చిలుకు పరుగుల తేడా ఓడించిన ప్రపంచంలోనే తొలి జట్టుగా దక్షిణాఫ్రికా( South Africa world record) నిలిచింది.
టీమిండియాను వైట్‌వాష్ చేయడంలో సౌతాఫ్రికా బౌలర్ల(South Africa Bowlers) కీలక పాత్ర పోషించారు. పేసర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సత్తా చాటగా.. మరో సఫారీ పేసర్ సైమన్ హార్మర్ రెండు మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా 17 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC 2023–2025) ఫైనల్లో సౌతాఫ్రికా విజేతగా నిలిచి ఐసీసీ ‘గద’ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ(2025-27) తాజా సీజన్‌లోనూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఆసియాలో ఈ ఏడాది తొలుత పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న సఫారీలు.. అనూహ్య రీతిలో భారత్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేశారు.
ఇవి కూడా చదవండి:
Smriti unfollowed Palas: ఇన్‌స్టాలో పలాశ్‌ను అన్‌ఫాలో చేసిన స్మృతి! నిజం ఏంటంటే..
ఈ క్రెడిట్ మా టీమ్ మొత్తానిది.. విజయంపై సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా