Chanakya Wisdom: ఈ విలువైన వాటిని జీవితంలో ఎప్పటికీ తిరిగి పొందలేరు.!
ABN , Publish Date - Nov 27 , 2025 | 01:54 PM
జీవితంలో కొన్నింటిని కోల్పోతే ఎప్పటికీ తిరిగి పొందలేరని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించారు. అయితే, చాణక్యుడి ప్రకారం జీవితంలో ఎప్పటికీ తిరిగి పొందలేనివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మన జీవితాలకు సంబంధించిన అనేక విషయాలను వివరించారు. జీవితాన్ని ఎలా గడపాలి, ఎవరితో సహవాసం చేయాలి, విజయం కోసం ఏం చేయాలి మొదలైన వాటి గురించి మనకు చెప్పారు . అదేవిధంగా, ఈ విలువైన వాటిని కోల్పోతే మనం ఎప్పటికీ తిరిగి పొందలేమని ఆయన అన్నారు. చాణక్యుడి ప్రకారం, మనం వేటిని పోగొట్టుకుంటే ఎప్పటికీ తిరిగి పొందలేమో ఇప్పుడు తెలుసుకుందాం..
సమయం:
కోల్పోయిన సమయాన్ని ఎప్పటికీ తిరిగి పొందలేము. సమయాన్ని గౌరవించని వ్యక్తులు తరువాత పశ్చాత్తాపపడవలసి వస్తుందని చాణక్యుడు చెప్పారు. ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా మాత్రమే విజయం సాధించగలరని ఆయన అన్నారు.
నమ్మకం:
ఆచార్య చాణక్యుడి ప్రకారం, ప్రతి బంధానికి నిజమైన బలం నమ్మకం. ఈ నమ్మకం కోల్పోతే, దానిని ఎప్పటికీ తిరిగి పొందలేము. అందువల్ల నమ్మకం కోల్పోకుండా బంధం బలంగా ఉండేలంటే ఎప్పుడూ నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం అని చాణక్యుడు చెప్పారు.
అవకాశాలు:
ఆచార్య చాణక్యుడి ప్రకారం, జీవితం అనేక అవకాశాలను అందిస్తుంది. కానీ వచ్చిన ప్రతి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. వీటిని సరిగ్గా ఉపయోగించుకుంటేనే ముందుకు సాగగలరు. లేకపోతే, పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. కాబట్టి, అవకాశాన్ని గుర్తించి సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం విజయానికి కీలకమని ఆచార్య చాణక్యుడు చెప్పారు.
Also Read:
శీతాకాలం.. గీజర్ ఉపయోగిస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి.!
ఉన్ని బట్టలు ఉతికేటప్పుడు ఈ తప్పులు చేయకండి
Also Give Latest News