Indian Cricket Coach: గంభీర్ స్థానంలో గంగూలీ
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:07 AM
ఐపీఎల్ జట్లకు డైరెక్టర్, మెంటార్‌గా వ్యవహరించిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. తాజాగా సౌతాఫ్రికాకు చెందిన ఎస్‌ఏ20 లీగ్ జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్‌కు కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ వార్త సోషల్ మీడియాలో...
జోరుగా ఊహాగానాలు
న్యూఢిల్లీ: ఐపీఎల్ జట్లకు డైరెక్టర్, మెంటార్‌గా వ్యవహరించిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. తాజాగా సౌతాఫ్రికాకు చెందిన ఎస్‌ఏ20 లీగ్ జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్‌కు కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ వార్త సోషల్ మీడియాలో ఊహాగానాలకు తెరలేపింది. ఫ్రాంచైజీ కోచ్‌గా బాధ్యతలు తీసుకొన్నాడంటే.. అతడు త్వరలో భారత కోచ్‌గా వస్తాడంటూ చర్చ మొదలైంది. ఇవన్నీ ఊహాగానాలుగా భావిస్తున్నా.. వాటిల్లో నిజం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుత కోచ్ గంభీర్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సత్తాచాటినా టెస్ట్‌లకు వచ్చేసరికి కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. రోహిత్, కోహ్లీ, అశ్విన్‌లాంటి ప్లేయర్ల రిటైర్మెంట్‌తో ఆయా స్థానాలు భర్తీచేసే వారి కోసం వెతకాల్సి ఉంది. ఈ క్రమంలో గంగూలీ అయితే జట్టును మెరుగ్గా తీర్చుదిద్దుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ, సీజన్ మధ్యలో కోచ్‌లను తప్పించే సంప్రదాయం బీసీసీఐకు లేదు. అన్నింటికంటే ముందు కోచ్‌గా దాదా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి