Palash Muchhal: స్మృతి మందానకు మరో షాక్.. ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త పలాశ్
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:29 PM
భారత్ మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన తండ్రి గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు కాబోయే భర్త పలాశ్ కూడా ఆస్పత్రిలో చేరాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా స్టార్ ప్లేయర్ స్మృతి మందాన (Smriti Mandhana) వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ (Palash Muchhal)తో స్మృతి వివాహం ఆదివారం సాయంత్రం జరగనుండగా.. ఉదయం ఆమె తండ్రి శ్రీనివాస్ మందాన గుండెపోటుకు గురయ్యారు. దీంతో పెళ్లి వాయిదా పడింది. ఈ షాక్ లో ఉన్న స్మృతికి మరో షాక్ తగిలింది. ఆమెకు కాబోయే భర్త పలాశ్ కూడా అనారోగ్యానికి గురయ్యారు.
పలాశ్ ముచ్చల్ వైరల్ ఇన్ఫెక్షన్(Palash Muchhal Health Issues) కు గురయ్యారు. దీనితో పాటు ఎసిడిటీ పెరిగినట్లు ఆయన స్నేహితులు తెలిపారు. చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చికిత్స తర్వాత పలాశ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ మందాన సాంగ్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజుల కిందటే మందాన వివాహ వేడుకలు మొదలయ్యాయి. మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు నిర్వహించారు. స్మృతి తండ్రి పూర్తిస్థాయిలో కోలుకునేదాకా ఆమె తన వివాహాన్ని వాయిదావేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు.
ఇవీ చదవండి: