Delhi Test: వెస్టిండీస్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - Oct 13 , 2025 | 04:18 PM
ఢిల్లీ వేదికగా భారత్ తో జరుగుతోన్న మ్యాచ్‌లో వెస్టిండీస్ 390 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ముందు 121 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత ఫాల్ ఆన్ లో కూడా ఆలౌట్ అవుతుందని అందరూ భావించినా..
ఢిల్లీ వేదికగా భారత్ తో జరుగుతోన్న మ్యాచ్‌లో వెస్టిండీస్ 390 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ముందు 121 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత ఫాల్ ఆన్ లో కూడా ఆలౌట్ అవుతుందని అందరూ భావించినా.. కరేబియన్ బ్యాటర్లు పోరాడి.. భారత్ బౌలర్లను శ్రమ పెట్టారు. కాంప్‌బెల్ (115), షై హోప్ (103) సెంచరీలు చేశారు. జస్టిన్ గ్రీవ్స్ (50*), రోస్టన్ ఛేజ్ (40), జైడెన్ సీల్స్ (32) రాణించడంతో విండీస్ జట్టు భారత్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
పదో వికెట్‌కు గ్రీవ్స్(Greaves ), సీల్స్ 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. ఇక భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్(Kuldeep Yadav) 3, బుమ్రా 3, సిరాజ్ 2, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 518/5 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అలానే విండీస్(West Indies) తొలి ఇన్నింగ్స్ లో 248 పరుగులకు ఆలౌట్ అయింది.
రెండో ఇన్నింగ్స్ లో ఓవర్‌నైట్ 173/2 స్కోరుతో నాలుగో రోజును ప్రారంభించిన కరేబియన్ జట్టు బాగా పోరాడింది. నాలుగో రోజు ఆటలో ఓపెనర్ కాంప్‌బెల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే అతడిని ఔట్ చేసిన కుల్‌దీప్ భారత్‌కు బ్రేక్ అందించాడు. 252/3 స్కోరు వద్ద విండీస్ లంచ్ బ్రేక్ కు వెళ్లింది. ఇక రెండో సెషన్‌లో టీమిండియా బౌలర్లు(Team India) అదరగొట్టడంతో విండీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది.
సెంచరీ చేసిన కాసేపటికే షై హోప్‌ను(Shai Hope) సిరాజ్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత రోస్టన్ ఛేజ్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. మరోవైపు క్రీజ్‌లోకి వచ్చిన బ్యాటర్లను భారత బౌలర్లు పెవిలియన్‌కు చేర్చారు. కుల్‌దీప్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. బుమ్ర బౌలింగ్‌లో సీల్స్ ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడుతుంది. తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడిన యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal ) కేవలం 8 పరుగులు చేసి..వారికన్(Warrican) బౌలింగ్ లో ఔటయ్యాడు.
ఇవి కూడా చదవండి..
Smriti Mandhana Six Pck: స్మృతి మంధానకు సిక్స్ ప్యాక్!.. అసలు నిజం ఇదే
Australia Chase Down: 330 చాల్లేదు