Shukri Conrad: టీమిండియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి
ABN , Publish Date - Dec 07 , 2025 | 04:43 PM
టీమిండియాపై తాను చేసిన వ్యాఖ్యలపై సౌతాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ వివరణ ఇచ్చారు. తాను ఏ దురుద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, అయినప్పటికీ అలాంటి పదం వాడి ఉండాల్సింది కాదని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో జరిగిన గువాహటి టెస్టు మ్యాచ్ సందర్భంగా దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ (Shukri Conrad) ‘గ్రోవెల్’ (సాష్టాంగపడటం) అనే పదం వాడిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్య భారత క్రికెట్ అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. భారత్‌తో వన్డే సిరీస్ (IND vs SA) ముగిసిన అనంతరం షుక్రి వివరణ ఇచ్చాడు. అయితే, తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలిపాడు. ఆ పదాలను ఉపయోగించినందుకు చింతిస్తున్నట్లు షుక్రి పేర్కొన్నాడు.
ఆయన(Shukri Conrad) మీడియాతో మాట్లాడుతూ..' ఎలాంటి దురుద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఎవరిని కించపరచాలనేది నా ఆలోచన కాదు. నేను తెలివిగా వ్యవహరించి మంచి పదం ఎంపిక చేసుకోవాల్సింది. భారత ఆటగాళ్లు ఎక్కువ సమయం ఫీల్డింగ్ కోసం మైదానంలో గడపాలన్నది నేను చెప్పాలనుకున్న ఉద్దేశము. కానీ, క్రికెట్ అభిమానులు దీనిని తప్పుగా అర్థం చేసుకున్నారు. భవిష్యత్‌లో నా భాష విషయంలో జాగ్రత్తగా ఉంటాను. ప్రతిదానికీ ఏదొక సందర్భం ముడిపడి ఉంటుంది. నా కామెంట్స్ తో వన్డే సిరీస్ ఆసక్తికరంగా మారింది. అలానే భారత్ వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడంతో త్వరలో జరగనున్న టీ20 సిరీస్ మరింత ఆసక్తికరంగా మారుతుంది’ అని షుక్రి(Shukri Conrad Comments) వివరించాడు.
షుక్రి చేసిన కామెంట్ ఇదే:
భారత్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. గువాహటిలో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో సఫారీలు భారీ విజయం సాధించారు. ఇదే సమయంలో ఫాలో ఆన్ ఇవ్వకుండానే బ్యాటింగ్ చేయడంపై మీడియా సమావేశంలో కోచ్ షుక్రి స్పందించాడు. టీమిండియా ఆటగాళ్లను ఎక్కువ సమయం గ్రౌండ్ లోనే ఉండేలా చేయాలని భావించామని, వారు మ్యాచ్ గెలుపు కోసం చివరి వరకూ వెంపర్లాడేలా ఉండేలా చేసేందుకే ఇన్నింగ్స్‌ను త్వరగా డిక్లేర్డ్ చేయలేదన్నాడు. ఆ సందర్భంలో షుక్రి చేసిన ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. విజయం కోసం ఆడటంలో తప్పులేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదంటూ ఫైర్ అయ్యాడు. తాజాగా వన్డే సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోవడంతో షుక్రికి భారత ప్లేయర్లు సరైన గుణపాఠం చెప్పారు సోషల్ మీడియా వేదికగా టీమిండియా ఫ్యాన్స్(Cricket Fan Reactions) కామెంట్లు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Yashasvi Jaiswal: చివరి వన్డేలో శతకం తర్వాత జైస్వాల్ సంచలన నిర్ణయం
రికార్డులకే ‘కింగ్’.. సచిన్ మరో రికార్డు బద్దలు!