Share News

Shubman Gill: ఆసియా కప్‌లో శుభ్‌మన్ గిల్‌కు ఛాన్స్ లేనట్టేనా.. కారణమేంటంటే..

ABN , Publish Date - Aug 18 , 2025 | 05:56 PM

టీమిండియా టెస్ట్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌కు ఆసియా కప్ ఆడే భారత జట్టులో చోటు దక్కే అవకాశం లేదా? ఇంగ్లండ్ పర్యటనలో అమోఘంగా రాణించి పలు రికార్డులు నెలకొల్పిన గిల్‌ను పక్కన పెట్టాలని సెలక్షన్ కమిటీ భావిస్తోందా? అంటే.. అవుననే సమాధానమే వస్తోంది.

Shubman Gill: ఆసియా కప్‌లో శుభ్‌మన్ గిల్‌కు ఛాన్స్ లేనట్టేనా.. కారణమేంటంటే..
Shubman Gill

టీమిండియా టెస్ట్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill)కు ఆసియా కప్ (Asia Cup 2025) ఆడే భారత జట్టులో చోటు దక్కే అవకాశం లేదా? ఇంగ్లండ్ పర్యటనలో అమోఘంగా రాణించి పలు రికార్డులు నెలకొల్పిన గిల్‌ను పక్కన పెట్టాలని సెలక్షన్ కమిటీ భావిస్తోందా? అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. వచ్చే నెల 9వ తేదీ నుంచి దుబాయ్‌ (Dubai)లో జరగబోతున్న ఆసియా కప్ పూర్తిగా టీ-20 ఫార్మాట్‌లో జరగబోతోంది. టీ-20 ఫార్మాట్‌కు గిల్ సరిపోడని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది.


గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్ యాదవ్ టీమ్ ఇండియా కెప్టెన్‌గా కొనసాగుతాడు. గిల్‌ను ఎంపిక చేస్తే అతడిని ఓపెనర్‌గా ఆడించాల్సి వస్తుంది. అయితే ఓపెనింగ్ స్థానాల్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అద్భుతంగా రాణిస్తున్నారు. వారిని మార్చడం మేనేజ్‌మెంట్‌కు ఇష్టం లేదు. మరో ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ కూడా ఉండనే ఉన్నాడు. అయినా గిల్‌ను ఎంపిక చేయాలంటే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న తిలక్‌ వర్మను పక్కన పెట్టాల్సి వస్తుంది. గిల్ కోసం అలా చేస్తే తీవ్ర విమర్శలు తప్పవు.


టాపార్డర్‌లో ఆడేందుకు గిల్‌కు సరైన స్థానం లేదు. ఈ నేపథ్యంలో అతడిని ఎంపిక చేసి రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేయడం అనవసరం అని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. గిల్ చివరిసారిగా 2024 జులైలో శ్రీలంకతో జరిగిన టీ-20 మ్యాచ్‌లో ఆడాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లండ్‌లతో జరిగిన టీ20 సిరీస్‌లలో గిల్‌కు చోటు దక్కలేదు. దీంతో ఈ ఆసియా కప్‌లో కూడా గిల్‌ను పక్కన పెట్టడం అనివార్యంగా కనిపిస్తోంది.


ఇవి కూడా చదవండి

లండన్ వీధుల్లో విరుష్క జోడీ.. స్థానికులతో ఎలా మాట్లాడుతున్నారో చూడండి..


పాక్‌ క్రికెటర్ల జీతాల్లో కోత

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 18 , 2025 | 05:56 PM