Shreyas Iyer: భారత్ ఎ కెప్టెన్‌గా శ్రేయాస్
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:51 AM
ఆసియాకప్ టీ20 టోర్నీలో చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయాస్ అయ్యర్‌ను సెలెక్టర్లు కరుణించారు. అతడిని భారత్ ‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. శనివారం 15 మందితో కూడిన...
నితీశ్ కుమార్‌కు చోటు
ఆసీస్ ‘ఎ’తో రెండు అనధికార టెస్టులు
న్యూఢిల్లీ: ఆసియాకప్ టీ20 టోర్నీలో చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయాస్ అయ్యర్‌ను సెలెక్టర్లు కరుణించారు. అతడిని భారత్ ‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. శనివారం 15 మందితో కూడిన ఈ జట్టును ప్రకటించారు. ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు వచ్చే వారం భారత పర్యటనకు రానుంది. సెప్టెంబరు 16 నుంచి 26 వరకు లఖ్‌నవూలో భారత్ ‘ఎ’, ఆసీస్ ‘ఎ’ జట్ల మధ్య రెండు అనధికారిక నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. శ్రేయాస్ గతేడాది ఫిబ్రవరిలో చివరి టెస్టు ఆడాడు. ఆసీస్ ‘ఎ’పై ప్రభావం చూపగలిగితే అక్టోబరులో వెస్టిండీ్‌సతో జరిగే టెస్టు సిరీ్‌సకు ఎంపికయ్యే చాన్సుంది. ప్రస్తుతం శ్రేయాస్ వెస్ట్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీ సెమీ్‌సలో ఆడుతున్నాడు. అలాగే గాయం నుంచి కోలుకున్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి కూడా ‘ఎ’ జట్టులో చోటు దక్కింది. ఇంగ్లండ్ పర్యటనలో అతను గాయపడిన విషయం తెలిసిందే. మరోవైపు రెండో టెస్టు కోసం కేఎల్ రాహుల్, సిరాజ్ జట్టులో చేరనున్నారు. అటు కరుణ్, సర్ఫరాజ్, శార్దూల్‌లకు సెలెక్టర్లు చోటివ్వకపోవడం గమనార్హం. ఈ రెండు టెస్టుల తర్వాత కాన్పూర్‌లో ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు జరుగుతాయి.
భారత్ ‘ఎ’ జట్టు: శ్రేయాస్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఎన్.జగదీశన్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (కీపర్), దేవ్‌దత్, హర్ష్ దూబే, ఆయుష్ బదోని, నితీశ్ కుమార్, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ క్రిష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మనవ్, యష్ ఠాకూర్. రాహుల్, సిరాజ్ (రెండో టెస్టుకు).
ఇవి కూడా చదవండి..
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కి మోదీ ఫోన్
తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం
For More National News And Telugu News