Tennis Hall of Fame: షరపోవాకు అరుదైన గౌరవం
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:47 AM
టెన్నిస్ మాజీ స్టార్ మరియా షరపోవా, డబుల్స్ మాజీ నెంబర్‌వన్ జోడీ, బ్రయాన్ బ్రదర్స్‌కు టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. ఆదివారం జరిగే కార్యక్రమంలో వీరి పేర్లను దిగ్గజాల సరసన...
టెన్నిస్ మాజీ స్టార్ మరియా షరపోవా, డబుల్స్ మాజీ నెంబర్‌వన్ జోడీ, బ్రయాన్ బ్రదర్స్‌కు టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. ఆదివారం జరిగే కార్యక్రమంలో వీరి పేర్లను దిగ్గజాల సరసన చేర్చనున్నారు. 2004 వింబుల్డన్‌లో సెరెనాను ఓడించి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన షరపోవా.. 2006లో యూఎస్ ఓపెన్, 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌తోపాటు రెండు ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు సాధించింది. నెం.1 ర్యాంక్‌ను అందుకొన్న తొలి రష్యన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. 2020లో రిటైర్మెంట్ ప్రకటించింది. డబుల్స్ సోదరులు బాబ్, మైక్ బ్రయాన్‌లు 2012 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించారు. 438 వారాలపాటు నెం.1 ర్యాంక్‌లో నిలిచారు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి