Share News

Sanju Samson: సంజు సామ్సన్ KKRలో చేరుతారా.. మరో ఇద్దరు టాప్ ఆటగాళ్లతో ఎక్సేంజ్ ఆఫర్..

ABN , Publish Date - Aug 16 , 2025 | 08:49 AM

ఐపీఎల్ చర్చలు మళ్లీ హాట్ టాపిక్‎గా మారాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, భారత T20I ఓపెనర్ సంజు సామ్సన్ గురించి జోరుగా చర్చలు వినిపిస్తున్నాయి. వచ్చే సీజన్‌కు ముందు సంజు మరో ఫ్రాంచైజీకి మారనున్నట్లు తెలుస్తోంది.

Sanju Samson: సంజు సామ్సన్ KKRలో చేరుతారా..  మరో ఇద్దరు టాప్ ఆటగాళ్లతో ఎక్సేంజ్ ఆఫర్..
Sanju Samson

భారత జట్టుకు చిన్న విరామం ఉన్న సమయంలో ఐపీఎల్ పుకార్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అత్యంత డిమాండ్ ఉన్న ఆటగాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, భారత T20I ఓపెనర్ సంజు సామ్సన్ గురించి కీలక విషయం తెలిసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ లో శాంసన్‌ చేరినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది పోటీకి వేలానికి ముందే ఆర్‌ఆర్ కెప్టెన్ ఎంపిక ఉన్న నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రఘువంశీ లేదా రమణ్‌దీప్ సింగ్ వంటి హై ప్రొఫైల్ ఆటగాళ్లను రాజస్థాన్‌కు ఇచ్చి సంజును తమ టీమ్‌లోకి కేకేఆర్ తీసుకోవాలని యోచిస్తోందంటా.


వీరిద్దరూ సరిపోతారా..

ఇందులో రమణ్‌దీప్ గత సంవత్సరం ఇండియా తరఫున అరంగేట్రం కూడా చేశాడు. కానీ వీళ్ళిద్దరూ రాజస్థాన్‌కి అవసరమా అన్నది ప్రశ్న. ఎందుకంటే RRకి ప్రస్తుతం అవసరమైనది స్పష్టమైన పేస్ బౌలింగ్, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో నమ్మదగిన బ్యాటింగ్ కావాలి. కానీ ఈ ఇద్దరి స్టైల్ ఆ అవసరాలకు పూర్తిగా సరిపోరు. అయినా ఫ్యూచర్ ఇన్‌వెస్ట్మెంట్‌గా చూసుకుంటే మాత్రం వారు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.


ఇప్పటికే చెన్నై కూడా..

సంజు సామ్సన్ పేరున్న ఆటగాడు. భారత జట్టులో టీ20 ఓపెనర్‌గా వెలుగొందుతున్న అతను, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా కూడా సేవలందిస్తున్నాడు. ఈసారి మాత్రం సంజును సంపాదించుకోవాలనే ఉత్సాహంలో ఇతర జట్లు బరిలో దిగాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ సంజును తమ టీమ్‌లోకి తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కొలకతా నైట్ రైడర్స్ (KKR) కూడా సంజు కోసం రంగంలోకి దిగింది.


సంజు సామ్సన్ సరిపోయేవాడేనా?

సంజు సామ్సన్ 100% సరిపోయే ప్లేయర్. ఎందుకంటే వికెట్ కీపింగ్ విషయంలో బాధ్యతలు ఎక్కువగా తీసుకుంటాడు. కాబట్టి గుర్బాజ్ లేదా డికాక్‌లకు సెలక్షన్ కన్‌ఫ్యూజన్ తగ్గుతుంది. టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌ని పెంచుకోవచ్చు. ఇండియన్ ప్లేయర్ కావడం వల్ల ఓవర్సీస్ స్పాట్‌ను సేవ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. సంజుకు కోసం ఏకంగా రూ.18 కోట్ల రిటైనర్ రేంజ్‌ ఉంది. కానీ KKR ఇచ్చే ఇద్దరు ప్లేయర్ల కలిపి విలువ కేవలం రూ.7 కోట్లు మాత్రమే. కాబట్టి ఈ ట్రేడ్‌కి ఇంకా ఎక్కువ ఇచ్చుకునే అవకాశం ఉంది. దీనిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.


ఇవి కూడా చదవండి

ఎటూ తేలకుండానే ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. తర్వాత మళ్లీ

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 16 , 2025 | 10:11 AM