Salman Nizar Hits: 12 బంతుల్లో 11 సిక్సర్లు
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:51 AM
కేరళ క్రికెట్ లీగ్ (కేఎల్‌సీ)లో కాలికట్ గ్లోబ్‌స్టార్స్ బ్యాటర్ సల్మాన్ నిజార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ చివరి 12 బంతుల్లో ఏకంగా 11 సిక్సర్లు బాది ఔరా.. అనిపించాడు. శనివారం త్రివేండ్రం రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...
సల్మాన్ నిజార్ సంచలనం
తిరువనంతపురం: కేరళ క్రికెట్ లీగ్ (కేఎల్‌సీ)లో కాలికట్ గ్లోబ్‌స్టార్స్ బ్యాటర్ సల్మాన్ నిజార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ చివరి 12 బంతుల్లో ఏకంగా 11 సిక్సర్లు బాది ఔరా.. అనిపించాడు. శనివారం త్రివేండ్రం రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సల్మాన్ 26 బంతుల్లోనే అజేయంగా 86 పరుగులు సాధించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన తను 19వ ఓవర్‌లో ఐదు వరుస సిక్సర్లతో 31 రన్స్ రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లోనైతే తానెదుర్కొన్న ఆరు లీగల్ డెలివరీలను సిక్సర్లుగా మలిచి 40 రన్స్ రాబట్టాడు. ఈ ఓవర్‌లో రెండో బంతి వైడ్ కాగా, మూడో బంతి నోబ్‌తో పాటు మూడు పరుగులు వచ్చాయి. ఈ బాదుడుకు కాలికట్ జట్టు చివరి 12 బంతుల్లో 75 రన్స్ సాధించి టీ20 ఫార్మాట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇక 187 రన్స్ ఛేదనలో రాయల్స్ 173 రన్స్‌కే పరిమితమై ఓడింది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి