Share News

Rohit Sharma-Gambhir: రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్లాన్ చెప్పేసిన గంభీర్..!

ABN , Publish Date - Oct 24 , 2025 | 07:34 PM

రెండో వన్డేలో రోహిత్ శర్మ కీలక నాక్ ఆడినప్పటికీ టీమిండియా గెలుపు రుచి చూడలేకపోయింది. మరోవైపు ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్ హిట్‌మ్యాన్‌కు చివరదా? రోహిత్ వీడ్కోలు పలకనున్నాడా?

Rohit Sharma-Gambhir: రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్లాన్ చెప్పేసిన గంభీర్..!

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ఆసీస్‌తో జరిగిన మొదటి వన్డేలో కేవలం 8 పరుగులే చేసి పెవిలియన్ చేరిన సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ(Rohit Sharma) అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో చెలరేగాడు. ఫిట్‌నెస్ పరంగానూ ఫామ్‌లోనూ తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాడు. రోహిత్ శర్మ(72) కీలక నాక్ ఆడినప్పటికీ టీమిండియా(Team India) గెలుపు రుచి చూడలేకపోయింది. మరోవైపు ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్ హిట్‌మ్యాన్‌కు చివరదా? రోహిత్ వీడ్కోలు(retirement) పలకనున్నాడా? అంటూ అభిమానుల మదిలో ఎన్నో సందేహాలు మెదులుతున్నాయి.


హెడ్ కోచ్ గంభీర్, రోహిత్, గిల్ ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. దీంట్లోనే రోహిత్ రిటైర్‌మెంట్‌పై స్పష్టత వచ్చింది. హిట్‌మ్యాన్ రిటైర్ అవ్వడంపై గంభీర్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. అడిలైడ్‌(Adelaide)లో మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్‌కు తిరిగి వస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇంతలో హోటల్ లాబీలో రోహిత్ శర్మను పిలిచి ఫొటో తీయమని అడుగుతాడు. దీంతో అదే అతడి వీడ్కోలు మ్యాచ్ అని భావించారు. గంభీర్(Gambhir) వ్యాఖ్యలకు రోహిత్ సహా పక్కనే ఉన్న గిల్ కూడా చిరునవ్వు చిందించారు. దీంతో ఇప్పుడే రోహిత్ శర్మ తన ఆటకు వీడ్కోలు పలకడనే విషయంపై పరోక్షంగా వెల్లడైంది. కాగా అడిలైడ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రోహిత్ శర్మ.. తన ఫామ్‌ను కొనసాగిస్తూ మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందంటూ ఫ్యాన్స్ భావిస్తున్నారు.


Also Read:

Afghan Dam on Kunar River: పాక్‌కు భారత్ తరహాలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన అఫ్ఘానిస్థాన్

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. కేసులు నమోదు చేసిన పోలీసులు

Updated Date - Oct 24 , 2025 | 07:35 PM