Share News

Rohit Sharma: రోహిత్ శర్మను తప్పించడం వెనుక కారణం అదేనా? టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన ఏంటి?

ABN , Publish Date - Oct 06 , 2025 | 01:59 PM

టీమిండియాకు నాయకత్వం వహించిన వారిలో రోహిత్ శర్మ ఎన్నో గుర్తుండిపోయే విజయాలు అందించాడు. రోహిత్ సారథ్యంలోని టీమిండియా 2023 ప్రపంచకప్ ఫైనల్‌కు వెళ్లింది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. వన్డేల్లో రోహిత్‌కు మంచి రికార్డ్ ఉంది.

Rohit Sharma: రోహిత్ శర్మను తప్పించడం వెనుక కారణం అదేనా? టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన ఏంటి?
Rohit Sharma captaincy

టీమిండియాకు నాయకత్వం వహించిన వారిలో రోహిత్ శర్మ ఎన్నో గుర్తుండిపోయే విజయాలు అందించాడు. రోహిత్ సారథ్యంలోని టీమిండియా 2023 ప్రపంచకప్ ఫైనల్‌కు వెళ్లింది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. వన్డేల్లో రోహిత్‌కు మంచి రికార్డ్ ఉంది. దీంతో 2027లో జరుగబోయే ప్రపంచకప్ వరకు టీమిండియా వన్డే సారథ్యం రోహిత్‌దేనని అందరూ అనుకున్నారు. అయితే సెలక్టర్లు అందరికీ షాకిచ్చారు. ఈ నెలలో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌కు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు (Rohit Sharma captaincy).


రోహిత్‌ను సారథ్యం నుంచి తప్పించడంపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. రోహిత్‌ను అవమానించారని అతడి అభిమానులు ఆరోపిస్తున్నారు. అయితే టీమిండియా మేనేజ్‌మెంట్ ఆలోచన మాత్రం భిన్నంగా ఉందట. రాబోయే కాలంలో టెస్ట్, వన్డే, టీ-20 సారథ్య బాధ్యతలను పూర్తిగా గిల్‌కే అప్పగించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోందట. మూడు ఫార్మాట్లకు ఒకరే కెప్టెన్ అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం మంచిగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారట. ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ ఉంటే టీమ్ కల్చర్ దెబ్బతింటుందనేది మేనేజ్‌మెంట్ ఆలోచనగా తెలుస్తోంది (ODI team culture).


రోహిత్ శర్మ ఫామ్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యమని, అతడు నాయకుడిగా ఉంటూ బ్యాటర్‌గా రాణించలేకపోతే అయోమయం నెలకొంటుందని మేనేజ్‌మెంట్ అనుకుంటోంది (Team India controversy). రోహిత్, కోహ్లీలను రెండేళ్ల తర్వాత జరిగే వన్డే ప్రపంచకప్ వరకు కాపాడుకోవాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించుకుందట. అందుకే వారిపై అదనపు బాధ్యతలు పెట్టకూడదని భావించి ఈ నిర్ణయం తీసుకుందట.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 06 , 2025 | 01:59 PM