Share News

Rishabh Pant injury: ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి.. రిషభ్ పంత్ గాయంపై లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే..

ABN , Publish Date - Sep 01 , 2025 | 07:26 AM

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పాదానికి గాయం అయిన సంగతి తెలిసిందే. గాయంతోనే బ్యాటింగ్‌కు దిగి అర్ధశతకం సాధించాడు. అనంతరం టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగాడు. అప్పట్నుంచి ఇంటికే పరిమతమయ్యాడు.

Rishabh Pant injury: ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి.. రిషభ్ పంత్ గాయంపై లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే..
Rishabh Pant injury Update

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పాదానికి గాయం అయిన సంగతి తెలిసిందే. గాయంతోనే బ్యాటింగ్‌కు దిగి అర్ధశతకం సాధించాడు. అనంతరం టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగాడు. అప్పట్నుంచి ఇంటికే పరిమతమయ్యాడు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఆసియా కప్‌లో కూడా పంత్ ఆడడం లేదు. విండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో కూడా పంత్ ఆడేది అనుమానంగానే మారింది (Rishabh Pant toe fracture).


అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటన సమయానికి మాత్రం పంత్ రెడీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి (Pant recovery update). సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పంత్ తరచుగా పలు ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. అలాగే జిమ్‌లో వర్కౌట్లు కూడా చేస్తున్నాడు. తాజాగా తన కాలికి పట్టీ వేసుకుని జిమ్‌లో ఉన్న ఫొటోను షేర్ చేసిన పంత్.. 'ఇంకా ఎన్ని రోజులు' అని కామెంట్ చేశాడు. ఈ పోస్ట్‌పై అభిమానులు భారీగా రియాక్ట్ అవుతున్నారు (Rishabh Pant news).


పంత్ గాయాన్ని అంచనా వేసిన వైద్యులు కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరం అని సూచించారు. ఇప్పటికి నాలుగు వారాలు పూర్తయింది. మరో 20 రోజుల అనంతరం బీసీసీఐ వైద్యులు పంత్ గాయాన్ని పరీక్షిస్తారు. గాయం నయమైందని భావిస్తే పంత్ చేత ప్రాక్టీస్ చేయిస్తారు. లేదంటే పంత్ మరికొన్ని రోజులు వేయిట్ చేయక తప్పదు.


ఇవి కూడా చదవండి

ఇదేంది భయ్యా.. ఇలా కూడా అవుట్ అవుతారా? బౌలర్ వైడ్ బాల్ వేస్తే..


సిరాజ్‌కు అది 5-స్టార్ జైలు.. ఓదార్చేందుకు కూడా కుదర్లేదు: భరత్ అరుణ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2025 | 07:26 AM